బాలినేని, సామినేనికి పదవులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..డీలిమిటేషన్ పై దృష్టి సారించింది. ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజనకు బీజం పడిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లు మొదలుకుని వార్డుల వరకు పునర్విభజన చోటు చేసుకోనుంది. వాటి రూపం సమూలంగా మారిపోనుంది.

దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52కు పెరుగుతాయి. కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లు ఉంటాయి. చివరి జనాభా లెక్కల ప్రాతిపదికన వార్డుల విభజన ఉంటుంది. తాజా నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్యను నిర్ణయించారు. రెండు లక్షలలోపు జనాభా ఉంటే ఇకపై 60 మంది వార్డు సభ్యులు ఉంటారు.

Pawan Kalyan forms high-profile committee to study AP local body polls and delimitation Process in AP

ఈ పరిణామాల మధ్య జనసేన తెరమీదికి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ భవిష్యత్ వ్యూహానికి ఇది కీలకంగా మారనుంది. రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికలు, నియోజకవర్గ హద్దులపై విశ్లేషణ చేస్తుందీ కమిటీ. తమ నివేదిక, సిఫార్సులను పార్టీ నాయకత్వానికి కమిటీ సమర్పిస్తుందని జనసేన ప్రకటించింది. ఈ బృందంలో పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

పాత 13 జిల్లాలను ఈ కమిటీ సభ్యులకు కేటాయించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అనకాపల్లికి చెందిన కోనతాల రామకృష్ణ, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, విశాఖపట్నం సౌత్‌- సీహెచ్ వంశీకృష్ణ ఇన్ ఛార్జీలుగా వ్యవహరిస్తారు. ఆయా జిల్లాలకు చెందిన డీలిమిటేషన్ వ్యవహారాన్ని ఈ ముగ్గురూ పర్యవేక్షిస్తారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఇన్ ఛార్జీలుగా కాకినాడ రూరల్‌ పంతం నానాజీ, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావు నియమితులయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల డీలిమిటేషన్ ప్రక్రియను మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పరిశీలిస్తారు. ప్రకాశం, నెల్లూరు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల పునర్విభజనకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీసీ వరుణ్ ఇన్ ఛార్జీగా వ్యవహరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+