షేక్ హసీనాకు భారత్ తొలి షాక్- బంగ్లాదేశ్ హ్యాపీ- కీలక వ్యాఖ్యలు..!

బంగ్లాదేశ్ (Bangaladesh)లో విద్యార్ధుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, భారత్ కు వచ్చి తలదాచుకుంటున్న షేక్ హసీనా (Sheikh Hasina) త్వరలో తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అంతకు ముందే బంగ్లాదేశ్ లో పరిస్ధితులపై భారత్ నుంచే వర్చువల్ గా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడేందుకు సిద్దమయ్యారు. ఇవాళ జరిగే ఈ కార్యక్రమంపై బంగ్లాదేశ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, తమకు దీంతో సంబంధం లేదని భారత్ తేల్చిచెప్పేసింది. దీనిపై బంగ్లాదేశ్ సానుకూలంగా స్పందించింది.

Advertisement
Gitanjali Angmo: భారత్ లో మార్పుకు సంకేతాలు - సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి జోస్యం..!
Advertisement

షేక్ హసీనాకు ఆశ్రయమిస్తున్న భారత్.. ఇవాళ ఆమె నిర్వహించే కార్యక్రమంతో మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదని దౌత్యపరంగా స్పష్టం చేసింది. ఈ కీలక పరిణామంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్బందించింది. పొరుగు దేశమైన భారత్‌తో దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ చెడగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చేసింది.
బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబైద్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌తో ఉన్న స్నేహపూర్వక ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడమే తమ తక్షణ ప్రాధాన్యమని షామా తెలిపారు.

మెటాకు కేంద్రం భారీ షాక్- జుకర్ బర్గ్ కు 3 రోజుల అల్టిమేటం..!
Advertisement

2024లో బంగ్లాదేశ్ లో తిరుగుబాటు నేపథ్యంలో భారత్ కు పారిపోయి వచ్చిన హసీనాకు కేంద్రం శరణార్దిగా ఆశ్రయం కల్పించింది. దీంతో ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. అయితే స్వదేశంలో ఆమె పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్ పై నిషేధం కొనసాగుతుండటం, ఇదే పరిస్ధితి మరికొన్నాళ్లు కొనసాగితే తిరిగి ఆమె స్వదేశం వెళ్లినా ఉపయోగం ఉండదని తేలిపోవడంతో హసీనా తిరుగుముఖం పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వరుసగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిపోతానని, అక్కడ తనకు మరణశిక్ష విధించే అవకాశం ఉన్నా చావుకు కూడా సిద్దమని తేల్చిచెప్పేశారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేసేందుకు సిద్దమైన నేపథ్యంలో భారత్ ఈ ఈవెంట్ తో తమకు సంబంధం లేదని చెప్పేసింది. ఈ ప్రకటనను బంగ్లాదేశ్ స్వాగతించింది.