బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ షహాబుద్దీన్ రాజీనామా: ఒక్క ఫోన్ కాల్‌తో చెలరేగిన ప్రకంపనలు!
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడంతో బంగ్లా రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బంగ్లా రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) నిబంధనల ప్రకారం.. ఆయన స్పీకర్ కు సంతకంతో కూడిన రాజీనామా లేఖను సమర్పించారు. నిజానికి ఆయన ఐదేళ్ల పదవీ కాలం 2028 ఏప్రిల్ వరకు ఉన్నప్పటికీ.. దాదాపు రెండేళ్ల ముందే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కొంపముంచిన రహస్య ఫోన్ కాల్!
మహమ్మద్ షహాబుద్దీన్ మే నెలలో వైద్య పరీక్షల కోసం లండన్ వెళ్లిన సమయంలో భారత్ లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రావడం బంగ్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈ ఫోన్ సంభాషణల అనంతరం షేక్ హసీనా తాను మళ్లీ స్వదేశానికి తిరిగిరానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్లో తాను బంగ్లాదేశ్ చేరుకుంటానని వెల్లడించారు.

షేక్ హసీనా తిరిగి రావడం వెనుక అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ హస్తం ఉందనే ఆరోపణలు బలపడటంతో బంగ్లాదేశ్ లోని ప్రస్తుత ప్రభుత్వం ఆయనపై తీవ్ర ఒత్తిడి చేసింది. ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీఎన్పీ వర్గాలు డిమాండ్ చేశాయి. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. బంగ్లా భవన్లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలోనే ఆయన రాజీనామా సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత అధికారికంగా తన రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్ఫించారు. హసీనాతో ఒక్క ఫోన్ కాల్ వ్యవహారం అధ్యక్షుడి పదవినే బలితీసుకోవడం బంగ్లా రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది.
గతంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ హయాంలోనే(2023 ఏప్రిల్ 24న) ఆయన 22వ ఆధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అధికార మార్పిడి తర్వాత కూడా పదవిలో కొనసాగిన ఏకైక రాజకీయ నేత ఆయనే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications