తిరుపతిలో మరో రెండు టీటీడీ భారీ వసతి భవనాలు

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతిలో వసతులు కల్పించే ఉద్దేశంతో టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల్లో కొనసాగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ గురువారం పరిశీలించారు. నిర్దేశిత సమయం కంటే ముందే ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు.

ఈ తనిఖీల్లో భాగంగా అచ్యుతం, శ్రీపథం భవనాల్లోని సాధారణ గదులు, డార్మిటరీలు, పిలిగ్రిమ్ అమినిటీస్ సెంటర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. వీటితో పాటు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గదుల కేటాయింపు కౌంటర్లు, లాకర్ల సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. తిరుమల కొండపైకి వెళ్లే ముందు భక్తులు ఇక్కడ బస చేయడానికి వీలుగా అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

JEO TTD inspected the ongoing development works at the Achyutam and Sripatham buildings in Tirupati

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గదుల బుకింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని శరత్ చెప్పారు. ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని ప్రతి వారం నిరంతరం పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.

వారసుడిని ప్రకటించిన మాయావతి
వారసుడిని ప్రకటించిన మాయావతి

శ్రీవారి సేవలో భాగస్వాములయ్యేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే శ్రీవారి సేవకుల వసతి గృహాలు, వారికి కల్పిస్తున్న ఇతర సౌకర్యాలపైనా జెఈఓ ప్రత్యేకంగా దృష్టి సారించారు. సేవకులకు కేటాయించిన విభాగాల్లో భోజన వసతి, తాగునీరు, విశ్రాంతి గదుల సముదాయాలను ఆయన స్వయంగా పరిశీలించి నూతన సూచనలు చేశారు. శ్రీవారి సేవకులు భక్తులకు మరింత ఉత్సాహంగా సేవలందించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

తిరుమల కొండపై భక్తుల ఒత్తిడిని తగ్గించడానికి అచ్యుతం, శ్రీపథం లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావడానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడి నుంచే భక్తులు సులభంగా దర్శన టికెట్లు, వసతి పొందేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించబోతోంది. రైల్వే స్టేషన్, బస్టాండ్‌లకు సమీపంలో ఉన్న ఈ భవనాలలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తే సామాన్య భక్తులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+