తెరపై టీటీవీ దినకరన్- ఉన్నపళంగా గవర్నర్ తో భేటీ

తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వాదనకు మద్దతుగా ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. చెన్నై లోక్ భవన్ లో ఆయనతో సమావేశమయ్యారు. రిసార్ట్ రాజకీయాలు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో తమ పార్టీ ఏకైక ఎమ్మెల్యే కనపించట్లేదని ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠను మరింత పెంచింది.

ఈ సందర్భంగా దినకరన్.. గవర్నర్‌కు ఒక లేఖను సమర్పించారు. ఎడప్పాడి కే పళనిస్వామికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎడప్పాడి కే పళనిస్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకేకు పూర్తి మద్దతును ఇస్తున్నానని ఈ లేఖలో స్పష్టంగా పొందుపరిచారు. తమ పార్టీ తరఫున మన్నార్‌గుడి నియోజకవర్గం నుండి కమరాజ్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

TTV Dinakaran backs AIADMK claims missing MLA horse-trading twist in Tamil Nadu government fight

ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే ఆచూకీ లేకుండా పోయారని, ఇది క్యాంప్ రాజకీయాల్లో భాగంగా జరిగి ఉండొచ్చని దినకరన్ అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన ఏకైక శాసనసభ్యుడిని ప్రలోభాలకు గురి చేస్తోన్నారని విజయ్ పై ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమ పార్టీకి విజయ్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన రాజకీయ వైఖరిని కూడా తప్పుబట్టారు. విజయ్ తనను తాను ఓ శక్తిమంతమైన నాయకడిగా చెప్పుకొంటూనే.. ఇతర పార్టీల ఎమ్మెల్యలను కొనుగోలు చేయడానికి ప్రయత్నరిస్తోన్నారని విమర్శించారు.

అక్కడితో ఆగలేదు దినకరన్. కామరాజ్ మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారాయన. స్వయంగా దినకరన్ చెన్నై గిండి రేంజ్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే కామరాజ్ పేరుతో టీవీకే ఓ లేఖను ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. తాము టీవీకేకు బదులుగా ఏఐఏడీఎంకే మద్దతు ప్రకటించామని, ఈ విషయాన్ని గవర్నర్ కు వివరించినట్లు ఆయన తెలిపారు.

టీటీవీ దినకరన్ గవర్నర్ ను కలవడం, ఏఐఏడీఎంకేకు మద్దతు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నంబర్ గేమ్ మరో మలుపు తిరిగింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుగా టీవీకేకు ఉన్న సంఖ్యా బలం 116 వద్దకు వచ్చి చేరింది. వీసీకేకు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే సరిగ్గా 118 మార్క్ వద్దకు వచ్చి ఆగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+