గంగూలీ.. ఆ వైడ్ రూల్‌ను మార్చండి: సునీల్ గవాస్కర్
వైడ్ బౌన్సర్ల విషయంలో ఫాస్ట్ బౌలర్లకు వెసులుబాటు కల్పించేలా ప్రస్తుతం ఉన్న రూల్‌ను మార్చాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ ఇందు కోసం చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఈ తరం క్రికెట్‌లో బౌలర్లపై బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతోందని, ప్రస్తుతం ఉన్న రూల్స్‌తో ఫాస్ట్ బౌలర్లు అల్లాడిపోతున్నారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
బ్యాటర్లు రాజ్యమేలుతున్న పొట్టి క్రికెట్‌లో బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు వణికిపోతున్నారని, వారికి కాస్త ఊరట కలిగించేలా నిబంధనలు తీసుకురావాలని గవాస్కర్ సూచించారు. తదుపరి ఐసీసీ క్రికెట్ కమిటీ మీటింగ్‌లో గంగూలీ.. ఈ వైడ్ బౌన్సర్ల విషయాన్ని తప్పక ప్రస్తావించాలని కోరారు. ఓ జాతీయ దినపత్రికకు రాసిన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ ఈ విషయాన్ని పేర్కొన్నారు.

'బ్యాటర్ తల మీదుగా కొంచెం ఎత్తులో వెళ్లే బౌన్సర్‌ను కూడా వైడ్ బాల్‌గా పరిగణిస్తున్నారు. ఇది పేసర్లకు ఇబ్బందిగా మారింది. ఒక చెయ్యి వెనక్కి కట్టేసి బౌలింగ్ చేయమని అన్నట్లు ఉంది. ఈ వైడ్ విషయంలో పేసర్లకు కాస్త వెసులుబాటు ఇవ్వండి. బంతిని వెనక్కి నెట్టడానికి తగినంత స్థలం ఉన్నప్పటికీ చిన్న బౌండరీలు పెడుతుండటంతో బౌలర్లు నష్టపోతున్నారు.
బ్యాటర్ సాధారణ పొజిషన్‌లో ఉన్నప్పుడు బంతి అతని తల మీదుగా వెళ్తే దాన్ని వైడ్‌గా పరిగణిస్తున్నారు. ఈ విధానంతో పేసర్లు మరింతగా నష్టపోతున్నారు. ఆ రూల్‌ను కొద్దిగా మార్చి బ్యాటింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు బ్యాటర్ తలపైన ఒక అడుగు మేర బౌన్సర్ సంధించడానికి అనుమతిస్తే పేసర్లకు కాస్త ఉపశమనం లభిస్తుంది. మరింత ఉత్సాహంతో బంతులు వేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది.'అని సునీల్ గవాస్కర్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.












Click it and Unblock the Notifications