TVK ఎమ్మెల్యేగా ఆటో డ్రైవర్.. కట్ చేస్తే కోటీశ్వరుడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. ముఖ్యంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అనూహ్య విజయాలతో దుమ్మురేపింది. ఈ విజయాల్లో అన్నిటికంటే హాట్ టాపిక్‌గా నిలిచింది రాయపురం నియోజకవర్గం. అక్కడ ఒక మాజీ ఆటో డ్రైవర్, రాజకీయ ఉద్ధండులను మట్టికరిపించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అయితే, ఈ గెలుపు సంబరాల మధ్య ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాయపురం అంటే అన్నా డీఎంకే (AIADMK) కంచుకోట. గత ఐదు పర్యాయాలుగా ఇక్కడ తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న మాజీ మంత్రి డి. జయకుమార్‌కు ఈసారి చుక్కెదురైంది. టీవీకే అభ్యర్థి విజయ్ దాము 59 వేలకు పైగా ఓట్లను సాధించి, తన సమీప ప్రత్యర్థి డీఎంకేకు చెందిన సుబైర్ ఖాన్‌పై 14,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాజకీయ దిగ్గజం జయకుమార్ మూడో స్థానానికి పడిపోవడం తమిళ రాజకీయాల్లో పెను మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.

Vijay Dhamu Wins Rayapuram Former Auto Driver Defeats AIADMK Veteran But Innova In Affidavit Sparks Row
DMK తో పొత్తుపై అన్నాడీఎంకే సంచలన ప్రకటన
DMK తో పొత్తుపై అన్నాడీఎంకే సంచలన ప్రకటన

ఆటో డ్రైవర్ ఇమేజ్.. అఫిడవిట్‌లో అసలు సంగతి

సామాన్యుడి ప్రతినిధిగా, ఒక ఆటో డ్రైవర్‌గా విజయ్ దాము ఓటర్ల మనసు గెలుచుకున్నారు. కానీ, ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అఫిడవిట్ ప్రకారం.. విజయ్ దాము పేరు మీద ప్రస్తుతం ఒక్క ఆటో కూడా లేదు. దానికి బదులుగా.. రూ. 20 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా (2025లో కొనుగోలు చేసినది). రెండు హోండా బైకులు ఉన్నాయి. సుమారు రూ. 25 లక్షల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. వృత్తి పరంగా తాను 'ఆటో కన్సల్టెన్సీ' వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

విజయ్ సంచలన నిర్ణయం.. 107 మంది TVK ఎమ్మెల్యేలు రాజీనామా..??
విజయ్ సంచలన నిర్ణయం.. 107 మంది TVK ఎమ్మెల్యేలు రాజీనామా..??

దీంతో కొందరు నెటిజన్లు ఆయన 'ఆటో డ్రైవర్' ఇమేజ్‌ను కేవలం ఎన్నికల పబ్లిసిటీ (PR) కోసమే వాడుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు మాత్రం "తమ నాయకుడు తన ప్రస్థానాన్ని ఆటో డ్రైవర్‌గానే మొదలుపెట్టారని, ప్రస్తుతం డ్రైవింగ్ చేయడం లేదని ఆయన ఎప్పుడూ దాచలేదని" గట్టిగా సమర్థిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+