విజయ్ 10th మార్కుల షీట్ ట్రెండింగ్.. సీఎం అవ్వడంలో తప్పు లేదంటూ..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దాంతో విజయ్ నేతృత్వంలో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్. రవితో విజయ్ సమావేశం అయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇక మే 7 గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమానికి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరంగా కాగా కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం ఇప్పుడు 112 కు చేరింది. మరో ఆరుగురికోసం టీవీకే పార్టీ పలువురితో చర్చలు నిర్వహిస్తోంది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆయన టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

విజయ్ కు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండేది. అయితే చదువు పూర్తయిన తర్వాతే నటన గురించి ఆలోచించాలని విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ చెప్పారు. అలా చదువుపైనే దృష్టి సారించిన విజయ్ 10వ తరగతి సాధారణ పరీక్షలో 1100 మార్కులకు 711 మార్కులు సాధించారు. దాని ప్రకారం విజయ్ తమిళంలో 155/200, గణితంలో 95/200, ఇంగ్లీషులో 133/200, సైన్స్‌లో 206/300, సోషల్ సైన్స్‌లో 122/200 మార్కులు సాధించారు. మొత్తానికి పదోతరగతిలో విజయ్ కు 65 శాతంతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఇక ప్రస్తుతం విజయ్ టెన్త్ మార్క్స్ కు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక డిగ్రీని మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసిన విజయ్.. సినిమాల్లోకి వచ్చి తన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ కు సంపాదించుకున్నారు.












Click it and Unblock the Notifications