విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్..తలైవా సహా, జగన్ కు ఫోన్ - పార్టీ ఖర్చులతో..!!
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నుంచి ఇప్పటి కే ఈ మేరకు ఆహ్వానం అందుకున్నారు. గవర్నర్ తో భేటీ కానున్న విజయ్ తనకు మద్దతు ఇస్తు న్న పార్టీల వివరాలు.. లెక్కలు అందించనున్నారు. తనతో పాటుగా తన కేబినెట్ లో మంత్రుల లిస్టు గవర్నర్ కు ఇవ్వనున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ తో సహా పలు పార్టీల ముఖ్యులు.. తలైవా రజనీకాంత్ తో పాటుగా సినీ ప్రముఖులు హాజరు అవుతున్నారు. అయితే... ప్రమాణ స్వీకారం సైతం తన పార్టీ ఖర్చుతోనే నిర్వహించాలని విజయ్ నిర్ణయించినట్లు సమాచారం.
తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అవుతోంది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ నుంచి ఇప్పటి కే విజయ్ కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. విజయానికి 10 సీట్ల దూరంలో ఆగిన విజయ్ కు కాంగ్రెస్, వామపక్షాలు సహా మరో మూడు పార్టీలు మద్దతు ఇస్తూ లేఖలు ఇచ్చాయి. దీంతో.. విజయ్ కూటమి బలం 124 కు చేరింది.

దీంతో.. గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు. తన కు మద్దతు ఇస్తున్న పార్టీల వివరాలు.. సంఖ్యా బలం గురించి వివరించారు. తనతో పాటుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వివరాలు అందించారు. అటు ప్రమాణ స్వీకారానికి చెన్నై లోని నెహ్రూ స్టేడియం సిద్దం చేస్తున్నారు. దాదాపు అయిదు వేల మంది ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నట్లు సమాచారం అందుతోంది. రాహుల్ తో పాటుగా పలు పార్టీల అధినేతలను విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వాని స్తున్నారు. మాజీ సీఎంలు స్టాలిన్.. పళిని స్వామికి ఆహ్వానాలు పంపుతున్నారు. అదే విధంగా ఏపీ మాజీ సీఎం జగన్ - విజయ్ ఫోన్ లో మాట్లాడుకున్నట్లు సమాచారం. విజయ్ ను జగన్ ప్రత్యేకంగా అభినందించారు.
అయితే, కామన్ మ్యాన్ కు దగ్గరయ్యే విధంగా తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహాలు అమలు చేసిన విజయ్.. ఇప్పుడు ప్రమాణ స్వీకారం వేళ ఆర్భాటాలకు దూరం గా పార్టీ ఖర్చుతోనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. విజయ్ కేబినెట్ కూర్పు పూర్తి చేసారు. బీజేపీ నేతలకు విజయ్ ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. దీంతో.. భారీ అంచనాలతో అనూహ్య విజయం సొంతం చేసుకున్న విజయ్ ప్రమాణ స్వీకారం నుంచి తీసుకునే ప్రతీ నిర్ణయం ఆసక్తి పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications