విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్, ఆ పార్టీల మద్దతు- గవర్నర్ కు 'మెజార్టీ' లిస్టు...!!

విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పై బిగ్ అప్డేట్. తమిళనాట మారుతున్న రాజకీయ లెక్కలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటు కు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 118 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో.. విజయ్ పార్టీ నేతలు వీసీకే తో సహా వామపక్షాలతో మంత్రాంగం నడిపారు. ఇప్పుడు ఆ లెక్కలు కొలిక్కి వచ్చాయి. ఆ పార్టీలకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి నుంచి సానుకూలత రావటంతో మరోసారి గవర్నర్ ను విజయ్ కలిసి 118 మంది మద్దతు జాబితా ఇవ్వనున్నారు. అన్నీ అనుకూలిస్తే రేపే విజయ్ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.

విజయ్ మద్దతు దారులకు బిగ్ రిలీఫ్. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కు కావాల్సిన సంఖ్యా బలం పైన దాదాపు స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ కు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 మంది మద్దతు పైన స్పష్టత ఇస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో... విజయ్ పార్టీ మద్దతు ఇవ్వాలంటూ
వీసీకే, సీనీఐ, సీపీఎం పార్టీలను అభ్యర్ధించింది. అందులో వీసీకే నేత తిరమావళవన్ తాజాగా విజయ్ తో సమావేశం అయ్యారు. మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ అంగీకరించారు. అదే విధంగా సీపీఐ, సీపీఎం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఈ మూడు పార్టీల నుంచి ఆరుగురు సభ్యుల మద్దతు దక్కనుంది. వీరి లేఖలతో విజయ్ గవర్నర్ ను కలిసేందుకు సిద్దమయ్యారు.

విజయ్ రాజీనామా అల్టిమేటం, స్టాలిన్ ఊహించని నిర్ణయం - లైన్ క్లియర్..!!
విజయ్ రాజీనామా అల్టిమేటం, స్టాలిన్ ఊహించని నిర్ణయం - లైన్ క్లియర్..!!
vijay-to-meet-governor-again-to-stake-claim-for-government-formation-amid-support-signals-from-vck-a

అన్నీ అనుకూలిస్తే రేపే విజయ్ ప్రమాణ స్వీకారం..?

వీసీకే, వామపక్ష పార్టీలకు చెందిన ఆరుగరు ఎమ్మెల్యేల మద్దతు పైన అధికారికంగా ప్రకటన వస్తే విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అవసరమైన మెజార్టీ వచ్చినట్లే. అయితే, వీసీకే నుంచి విజయ్ లేఖ తీసుకున్నట్లు సమాచారం. ఆ లేఖతో పాటుగా మొత్తం 118 మంది సభ్యుల లెక్కలతో ఈ సారి గవర్నర్ ను కలిసేందుకు సిద్దమయ్యారు .ఈ సాయంత్రం గవర్నర్ తో భేటీ వేళ ఈ మొత్తం జాబితాను సమర్పించే అవకాశం ఉంది. దీంతో.. గవర్నర్ తాను సూచించిన విధంగా 118 మంది జాబితా అందితే.. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రేపు (శనివారం) విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలకు ప్రభుత్వంలో భాగస్వాములుగా అవకాశం ఇవ్వటం లాంఛనంగా కనిపిస్తోంది. మొత్తం 20 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ సిద్దం అవుతున్నారు. అయితే.. ఈ పార్టీల అధికారిక ప్రకటన.. గవర్నర్ ఆహ్వానం ఇప్పుడు కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+