విజయ్-త్రిష.. వేణు స్వామి మరో బాంబు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 108 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో దళపతి విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసి సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎట్టకేలకు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి తనదైన శైలిలో అంచనాలు వేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

విజయ్ జాతకంలో త్రిష ప్రభావం!
ఈ వీడియోలో వేణు స్వామి అందరినీ ఆశ్చర్యపరిచేలా నటి త్రిష పేరును ప్రస్తావించారు. "నటి త్రిష గనుక విజయ్ పక్కన లేకపోయి ఉంటే, ఆయన జాతకం మరోలా ఉండేది" అని వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం లేదా వారి జాతక చక్రాల ప్రభావం విజయ్ రాజకీయ ఎదుగుదలపై ఖచ్చితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

Vijay-Trisha Connection Venu Swamy Predictions on Thalapathy Vijay CM Post and Re-Elections

ముఖ్యమంత్రి పదవి.. మధ్యంతర ఎన్నికలు?
తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. విజయ్ ఒకవేళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినా.. అది ఎంతో కాలం నిలవకపోవచ్చని వేణు స్వామి జోస్యం చెప్పారు. విజయ్ సీఎం అయిన ఒక నెల, ఆరు నెలలు లేదా ఏడాది కాలంలోనే మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు నూటికి వెయ్యి శాతం ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు. గురువు మార్పు కారణంగా తమిళనాడులో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయని.. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం కష్టమని ఆయన పేర్కొన్నారు.

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన
కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల గురించి కూడా వేణు స్వామి కొన్ని అంచనాలు వేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉందని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. గ్రహ గతుల మార్పు వల్ల రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ సంక్షోభాలు తలెత్తుతాయని హెచ్చరించారు. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన అంటూ వేణుస్వామి జోస్యం చెప్పినా.. అక్కడ బీజేపీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో అలా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో చర్చ
వేణు స్వామి గతంలో చెప్పిన కొన్ని జ్యోతిష్యాలు నిజమవ్వడంతో విజయ్ గురించి ఆయన చేసిన తాజా కామెంట్లపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. దళపతి విజయ్ అభిమానులు ఈ అంచనాలను కొట్టిపారేస్తుండగా.. సామాన్య ప్రజలు మాత్రం తమిళనాడులో రాబోయే రాజకీయ సంచలనాలు ఏమిటనేది ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+