విజయ్‌ను కాదని అదే జరిగితే, విపత్కర పరిస్థితులే- విశాల్ హెచ్చరిక..!!

తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు పైనా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. VCK, CPI, CPM పార్టీల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీలు ఈ రోజు తమ నిర్ణయం ప్రకటించనున్నాయి. విజయ్ కు వారి మద్దతు లేకుంటే DMK - AIADMK కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే చర్చ సాగుతోంది. ఈ ప్రతిపాదన పైన హీరో విశాల్ ఘాటుగా స్పందించారు. తీవ్ర హెచ్చరిక చేసారు.

తమిళనాడులో విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 ఎమ్మెల్యే మద్దతుకు ఇంకా దూరంలో ఉన్నారు. 118 మంది మద్దతు చూపిస్తూనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తానని గవర్నర్ స్పష్టం చేసారు. ఈ క్రమంలో టీవీకే అభ్యర్ధన మేరకు VCK, CPI, CPM పార్టీలు తమ మద్దతు పైన నిర్ణయం తీసుకోనున్నాయి. మూడు పార్టీలు మద్దతు కు అంగీకరిస్తే విజయ్ సీఎం అవ్వటం ఖాయం కానుంది.

Vishal Warns of Political Turbulence Ahead Says Unconventional Alliances Could Trigger Strong Public Backlash in Tamil Nadu

ఒక్క పార్టీ విభేదించినా.. కొత్త రాజకీయ లెక్కలు మొదలవుతాయి. అటు DMK - AIADMK పొత్తు లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలో ఈ పొత్తు పైన హీరో విశాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే గవర్నర్ విజయ్ కు మెజార్టీ నిరూపణ పైన విభేదించిన విశాల్.. గతంలో ఇదే గవర్నర్ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వైఖరిని గుర్తు చేసారు. తమిళనాడులో ఎందుకు ఈ కొత్త విధానం అంటూ నిలదీసారు.

ఇక, ఇప్పుడు విజయ్ కాకుండా.. DMK- AIADMK ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంటూ.. విశాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అందులో.. విశాల్ తన అభిప్రాయం స్పష్టం చేసారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. ఒక పౌరుడిగా.. సగటు ఓటరుగా ఈ పరిస్థితులను అంచనా వేస్తున్నానని పేర్కొన్నారు.

Vishal Warns of Political Turbulence Ahead Says Unconventional Alliances Could Trigger Strong Public Backlash in Tamil Nadu

ఆ పొత్తు ఎవరికీ ఆమోద యోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ రెండు పార్టీల పొత్తు సాధ్యం కాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. AIADMK మాత్రం అన్ని ప్రత్యామ్నాయాలను సిద్దం చేస్తోంది. కొత్త వ్యూహాలతో సిద్దం అవుతోంది. దీంతో.. ఇప్పుడు మారుతున్న లెక్కల వేళ విశాల్ చేసిన హెచ్చరిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+