దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్..?? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం..!!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో మునిగిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలే ఈ పరిస్థితిని తట్టుకోలేక చేతులెత్తేశాయి. ఇక పేద, మధ్య తరగతి దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఎక్కడి నౌకలు అక్కడే నిలిచిపోయి అనేక దేశాల్లో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇక అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశంలో ఇప్పటికే పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. రాత్రి 8 గంటల తర్వాత షాపులు, మార్కెట్లు మూసివేశారు. పాఠశాలలు, కాలేజీలు ఇప్పటికే మూసివేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా పాకిస్థాన్ పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ దేశంలోని ఇంధన సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ వద్ద కనీసం ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ నిల్వలు కూడా లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ లో విదేశీ మారకద్రవ్యం కొరత చమురు దిగుమతులు చేసుకోవడం అసాధ్యంగా మారిందని అలీ మాలిక్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద సరఫరా నిలిచిపోయిందని.. ప్రభుత్వం దిగుమతుల కోసం చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోందని ఆయన వెల్లడించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Pakistan Faces Severe Fuel Crisis as Supply Halts at Petrol Pumps Minister Ali Malik s Key Remarks

మరోవైపు భారత్ పై పాకిస్థాన్ పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ ప్రశంసలు కురిపించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని అన్నారు. భారత్.. అంతర్జాతీయంగా తనకున్న దౌత్య సంబంధాలు, ఆర్థిక ప్రగతి కారణంగా ఇతర దేశాల నుంచి కేవలం ఒక్క సంతకంతో చమురును పొందుతోందని ఆయన అన్నారు. కానీ పాకిస్థాన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మార్కెట్ లో భారత్ కు ఉన్న పరపతిని ఆయన కొనియాడారు. ప్రస్తుతం అలీ మాలిక్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+