విజయ్ దెబ్బకు AIADMK కకావికలు..! ఇవాళ ముగ్గురు మాజీ మంత్రులు..!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే (AIADMK) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రులు డాక్టర్ సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్, ఎం.ఎస్.ఎం. ఆనందన్ తమ మద్దతుదారులతో కలిసి నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీలో చేరనున్నారు. చెన్నై సమీపంలోని మామల్లాపురంలో ఇవాళ జరగనున్న భారీ బహిరంగ సభలో వీరంతా అధికారికంగా టీవీకే గూటికి చేరనున్నారు.

టీవీకేలోకి ముగ్గురు అన్నాడీఎంకే మాజీలు (AIADMK)

ఈ సందర్భంగా మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ మాట్లాడుతూ, తాము ఈ నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోలేదని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గ ప్రజలు, జిల్లా స్థాయి ప్రతినిధులు మరియు మద్దతుదారులతో అనేక విడతలుగా చర్చించిన తర్వాతే ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమిళనాడులో బలమైన రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ కీలక అడుగు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Big Blow To AIADMK Former Ministers Join Thalapathy Vijay s TVK Party In Tamil Nadu Politics
హైకోర్టు హద్దు దాటింది..! సుప్రీం మెట్లెక్కిన విజయ్..!
హైకోర్టు హద్దు దాటింది..! సుప్రీం మెట్లెక్కిన విజయ్..!

ఏఐఏడీఎంకే నాయకత్వంపై తీవ్ర విమర్శలు

ప్రస్తుత ఏఐఏడీఎంకే నాయకత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే తాము పార్టీని వీడాల్సి వచ్చిందని మాజీ మంత్రులు ఆరోపించారు. సుమారు 45 ఏళ్ల పాటు ఏఐఏడీఎంకేలో పనిచేసిన మాజీ మంత్రి ఆనందన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిసామి (ఈపీఎస్) శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసమే నడుస్తోందని, నిబద్ధత కలిగిన కార్యకర్తలను పూర్తిగా निर्లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

Big Blow To AIADMK Former Ministers Join Thalapathy Vijay s TVK Party In Tamil Nadu Politics
విజయ్ సర్కార్ పడగొట్టేందుకు విఫలయత్నం ? ఎమ్మెల్యేకు 35 కోట్లు.. ! అరెస్టులు.!
విజయ్ సర్కార్ పడగొట్టేందుకు విఫలయత్నం ? ఎమ్మెల్యేకు 35 కోట్లు.. ! అరెస్టులు.!

టీవీకేదే భవిష్యత్తని ధీమాా

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీయే భవిష్యత్తు అని ఈ నేతలు అభిప్రాయపడుతున్నారు. విజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పాలన అందుతుందనే నమ్మకం తమకు ఉందని మాజీ రవాణా మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ పేర్కొన్నారు. ఈ చేరికలపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ, ఎటువంటి ఒత్తిళ్లు లేదా ప్రలోభాలకు గురికాకుండా తమ స్వచ్ఛంద ఆసక్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని నేతలు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+