వెంకీ- అనిల్ రావిపూడి సినిమాకు అద్దిరిపోయే టైటిల్.. మరోసారి బ్లాక్ బస్టర్ గ్యారంటీ..
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. చేసినవి 9 సినిమాలు.. అన్నీ సూపర్ డూపర్ హిట్సే.. ఇలాంటి ట్రాక్ రికార్డులు చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఉంటాయి. ఆయనకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే..? ఏటా సంక్రాంతి పండుగకు ఓ సినిమాను తీసుకొస్తారు.. బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వర ప్రసాద్ గారు' లాంటి రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ తో ఏకంగా ఐదో సినిమాతో వస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనిల్ రావిపూడి టైటిల్ కొత్తగా.. క్రేజీగా ఉంది.
విక్టరీ వెంకటేశ్, కల్యాణ్ రామ్ నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ కింద బావ బామ్మర్ది సౌజన్యంతో అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ టైటిల్ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా టైటిల్స్ యందు అనిల్ టైటిల్స్ వేరయా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ ను చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాలోని ఓ కామెడీ సీన్ తో స్టార్ట్ అవుతుంది. అప్పుల అప్పారావు సినిమాలో ఏ అప్పారావు..? ఏ అప్పారావు..? అని అడిగే సీన్ తో స్టార్ట్ అవుతుంది.
వెంటనే వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి, అనిల్ రావిపూడి అందరూ ఒకే చోట ఉన్నారు. అప్పుడు వెంకటేశ్.. అనిల్ సినిమా టైటిల్ ఏంటి..? అడుగుతాడు.. అప్పుడు దర్శకుడు అనిల్ జనవరి 12 విడుదల అంటారు. నేను అడుగుతున్నది రిలీజ్ డేట్ కాదు.. అంటారు. వెంటనే కల్యాణ్ రామ్.. సర్ అడుగుతున్నది సినిమా టైటిల్ అంటారు. వెంటనే అనిల్ రావిపూడి.. మళ్లీ జనవరి 12 విడుదల అని అంటారు. దాంతో ఈ మూవీ టైటిల్ ను అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల అని చెప్పేశారు. సినిమా రిలీజ్ డేట్ కూడా జనవరి 12 విడుదల అని చెప్పేశారు.

ఇక ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలాగే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీ. వీ. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications