అంతరిక్ష ప్రయోగాల్లో సంచలనం: తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్ సేఫ్ ల్యాండింగ్!

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో కీలక ముందడుగు వేసింది. చైనాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 'ల్యాండ్‌స్పేస్' అంతరిక్ష పరిశోధన రంగంలో అరుదైన ఘనత సాధించింది. తమ 'జూక్వే-3' ఆర్బిటల్ రాకెట్ మొదటి దశను భూమిపై సురక్షితంగా, నిలువుగా ల్యాండ్ చేసి రికవరీ చేసింది. ఈ విజయంతో భూమిపై ల్యాండింగ్ పద్ధతి ద్వారా ఆర్బిటల్ రాకెట్‌ను తిరిగి పొందిన అత్యంత కొద్ది దేశాలు, సంస్థల జాబితాలో చైనా చేరింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే ఖర్చును తగ్గించడంలో ఇది విప్లవాత్మక పురోగతిగా నిలవనుంది.

చంద్రుడిపై ఫాల్కన్ సృష్టించిన విధ్వంసం: ఎన్నో రహస్యాలు వెలుగులోకి
చంద్రుడిపై ఫాల్కన్ సృష్టించిన విధ్వంసం: ఎన్నో రహస్యాలు వెలుగులోకి

గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఆగస్టు 19న ఉదయం 66 మీటర్ల పొడవున్న జూక్వే-3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇది 'హోంగ్‌హు-3' అనే ఇంటర్నెట్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 9 ఇంజిన్లు కలిగిన రాకెట్ మొదటి దశ ప్రధాన భాగం నుంచి విడిపోయి.. ప్రయోగ కేంద్రానికి దాదాపు 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాన్సు ప్రావిన్స్‌లోని మిన్కిన్ కౌంటీ వద్ద ల్యాండింగ్ కాళ్లను పరిచి నిలువుగా ల్యాండ్ అయింది. ప్రయోగం అనంతరం రాకెట్ తొలి దశను నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఈ సారి రాకెట్లో ప్రత్యేకంగా అమర్చిన విస్తరించగల ల్యాండింగ్ కాళ్లను ఉపయోగించారు.

China LandSpace Achieves Historic First Reusable Rocket Landing after putting a satellite into orbit

రీయూజబుల్ రాకెట్లు ఎందుకు ముఖ్యం?
సాటిలైట్లను కక్ష్యలోకి పంపిన ప్రతిసారీ కొత్త రాకెట్లను తయారుచేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కానీ ప్రయోగం తర్వాత రాకెట్ బూస్టర్లను సురక్షితంగా భూమికి రప్పించి మళ్లీ ఉపయోగించడం వల్ల అంతరిక్ష ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గుతుంది. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తమ ఫాల్కన్-9 రాకెట్ల ద్వారా ఈ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేయగా.. ఇప్పుడు చైనా కూడా రెండు వేర్వేరు పద్దతుల్లో(సముద్రంలో నెట్ ద్వారా, భూమిపై నిలువు ల్యాండింగ్ ద్వారా) రాకెట్లను రికవరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9కు చైనా పోటీ? ‌
జూక్వే-3 రాకెట్ నిర్మాణంలో ద్రవ మిథేన్, ద్రవ ఆక్సిజన్‌ను ఇంధనంగా ఉపయోగించారు. చౌకగా లభించే, వేడిని తట్టుకునే స్టెయిన్‌లెస్ స్టీల్‌తో దీనిని తయారు చేయడం వల్ల తయారీ ఖర్చు తగ్గుతుంది. ఈ రాకెట్ బూస్టర్‌ను దాదాపు 20 సార్లు తిరిగి ఉపయోగించవచ్చని ల్యాండ్‌స్పేస్ పేర్కొంది.స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాల రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. జూక్వే-3 దానికి గట్టి పోటీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

SBI ఖాతాదారులకు బిగ్ షాక్: ఇకపై ఉచిత లావాదేవీల నిబంధనల్లో మార్పులు!
SBI ఖాతాదారులకు బిగ్ షాక్: ఇకపై ఉచిత లావాదేవీల నిబంధనల్లో మార్పులు!

విఫలమైన తొలి యత్నం.. మలి యత్నంలో విజయం
డిసెంబర్లో జరిగిన తొలి ప్రయత్నంలో జూక్వే-3 రెండో దశ కక్ష్యను చేరుకున్నప్పటికీ.. మొదటి దశ భూమిపై దిగే సమయంలో సాంకేతిక లోపంంతో పేలిపోయింది. ఆ తర్వాతి కాలంలో ల్యాండింగ్ ఇంజిన్ల కాన్ఫిగరేషన్, ఆటోమేటిక్ సేఫ్టీ కంట్రోల్, థర్మల్ ప్రొటెక్షన్ విభాగాల్లో ముర్పులు చేసి ల్యాండ్‌స్పేస్ సంస్థ ఈ సారి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

చైనా ఉపగ్రహ ఇంటర్నెట్ ఆశయాలకు కొత్త ఊపిరి
చైనా 'గువోవాంగ్', 'ఖియాన్‌ఫాన్'పేరుతో వేలాది ఉపగ్రహాలతో కూడా భారీ ఇంటర్నెట్ కాన్స్టెలేషన్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేలాది సాటిలైట్లను రోదసిలోకి పంపాలంటే వందలాది ప్రయోగాలు అవసరం. ఇలాంటి రీయూజబుల్ రాకెట్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రయోగ వ్యయం తగ్గి, తక్కువ సమయంలో ఎక్కువ సాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడానికి చైనాకు మార్గం సుగమమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+