మే 9న ఏం జరగబోతుంది?.. ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఫోన్ కాల్..
ప్రపంచ రాజకీయ యవనికపై అత్యంత శక్తివంతమైన ఇద్దరు నేతలు చేతులు కలిపితే ఫలితం ఎలా ఉంటుందో తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ అయింది. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాల నుండి ఉక్రెయిన్ సంక్షోభం వరకు పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు జరిపడంతో మే 9న ఏం జరగబోతుందనే టెన్షన్ నెలకొంది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత సరైనదని పుతిన్ అభిప్రాయపడ్డారు. "ఈ చొరవ చర్చలకు తలుపులు తెరుస్తుంది మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని తీసుకువస్తుంది" అని పుతిన్ అన్నట్లు ఆయన దౌత్య సలహాదారు యూరి ఉషాకోవ్ వెల్లడించారు. పెర్షియన్ గల్ఫ్ పరిస్థితులతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై పుతిన్ కొన్ని నిర్మాణాత్మక ప్రతిపాదనలను ట్రంప్ ముందు ఉంచారు.

ఉక్రెయిన్ సంక్షోభం: విజయ దినోత్సవం వేళ కాల్పుల విరమణ!
ఈ సంభాషణలో అత్యంత కీలకమైన అంశం ఉక్రెయిన్ వివాదం. మే 9న రష్యా జరుపుకునే 'రెండవ ప్రపంచ యుద్ధ విజయ దినోత్సవం' (Victory Day) సందర్భంగా ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ ప్రతిపాదించారు. ఈ చారిత్రక సందర్భం ఇరు దేశాల ఉమ్మడి విజయాన్ని గుర్తుచేస్తుందని పేర్కొంటూ ట్రంప్ ఈ ప్రతిపాదనను సానుకూలంగా స్వీకరించారు. దీనికి అమెరికా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే, ఉక్రెయిన్ అనుసరిస్తున్న "ఉగ్రవాద పద్ధతుల"పై పుతిన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేయగా, త్వరలోనే ఒక శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మిత్రుడికి పరామర్శ.. ఆర్థిక బంధానికి ఆస్కారం!
కేవలం యుద్ధాలే కాకుండా, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై కూడా చర్చ సాగింది. డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని వ్లాదిమిర్ పుతిన్ ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ చర్చలు అత్యంత "వృత్తిపరంగా, స్నేహపూర్వకమైన" వాతావరణంలో జరిగినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఉమ్మడి ఆర్థిక, ఇంధన ప్రాజెక్టులను పట్టాలెక్కించే అంశంపై కూడా నేతలు ఒక అవగాహనకు వచ్చారు.














Click it and Unblock the Notifications