10 కోట్ల మందితో దేశవ్యాప్త ఉద్యమం.. మీరూ కలిసి రావాల్సిందే!

మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమి కొట్టటం కోసం 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ - గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మాకుమారీస్ 'మై భారత్' సంయుక్తంగా నిర్వహించిన '10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం' మరియు 'మెగా రక్తదాన ఉద్యమ' రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా ఘనంగా జరిగింది.

Advertisement

మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి ఉద్యమం

ముందుగ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించి, దేశ ప్రజలకు యువతకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరై ఈ మహత్తర సామాజిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి చేపట్టిన ఈ ప్రత్యేక ప్రచారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Advertisement

65 శాతం ఉన్న యువతనే మన అసలైన శక్తి: గవర్నర్

దేశ జనాభాలో 65 శాతం ఉన్న యువతనే మన అసలైన శక్తి అని, మాదకద్రవ్య రహిత సమాజంతోనే 'వికసిత్ భారత్ 2047' కల నెరవేరుతుందని ఉద్ఘాటించారు. ఇల్లు మారితేనే రాష్ట్రం, రాష్ట్రం మారితేనే దేశం మాదకద్రవ్యాల నుంచి విముక్తి పొందుతుందని స్పష్టం చేశారు. యువత అహంకారాన్ని వీడి స్వాభిమానంతో ముందడుగు వేయాలని, స్వామి వివేకానందుని స్ఫూర్తితో గమ్యం చేరేవరకు పోరాడాలని సూచించారు.

నషా ముక్త భారత్' ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్

ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ 'నషా ముక్త్ భారత్ అభియాన్' అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదనీ..ఇది వికసిత్ భారత్ 2047 నిర్మాణానికి బలమైన పునాది వేసే ఒక జాతీయ ప్రజా ఉద్యమం అని గవర్నర్ స్పష్టం చేశారు.అనంతరం సభలోని వారందరిచే గవర్నర్ 'నషా ముక్త భారత్' ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement
పిల్లల కళ్ళ ముందే భార్య కాళ్ళు చేతులు కట్టేసి గొంతుకోసిన భర్త!

ప్రచార రథాన్ని ప్రారంభించిన గవర్నర్

అనంతరం ప్రచార రథాన్ని గవర్నర్ జెండా ఊపి ప్రారంబించారు. ఈ వేడుకలో బ్రహ్మాకుమారీస్ హైదరాబాద్ డైరెక్టర్ రాజయోగిని బి.కే. కుల్దీప్ దీదీ , ఐఏఎస్ అధికారి దాన కిషోర్ , ఎమ్మెల్సీ కొమురయ్యతో పాటు ఇతర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

English Summary

10 Crore De-Addiction Pledge Campaign and Mega Blood Donation Drive were launched at Shanti Sarovar, Gachibowli, Hyderabad, jointly organized by Brahma Kumaris and MY Bharat to promote a drug-free society.