ఇంజనీర్లకు భారీ శుభవార్త.. మన ఐఐటీ హైదరాబాద్ లో మీకోసం గొప్ప అవకాశం!

ఇంజనీరింగ్ చేసిన వారికి శుభవార్త. సాధారణ ఇంజనీర్లను నిపుణులైన అణు ఇంజనీర్లుగా మార్చే అద్భుతమైన ప్రోగ్రాం అణుజ్ఞాన్ ఇప్పుడు మీకు అందిస్తుంది హైదరాబాద్ ఐఐటి మరియు క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్. అనుగ్యన్ పేరుతో ఈ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం అణుశక్తి రంగానికి సంబంధించింది. ఈ శిక్షణ కార్యక్రమం నేటి నుండి మూడు నెలల కాల పరిమితితో కొనసాగుతోంది.

Advertisement

అణుజ్ఞాన్ - న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్

ప్రధాని మోధీ వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా..2047 నాటికి 1000 గిగా వాట్ల అణు విద్యుత్ లక్ష్యంగా ఈ కార్యక్రమం ద్వారా న్యూక్లియర్ రంగ నిపుణులను తయారు చేస్తున్నారు. పౌర అణుశక్తి రంగానికి ఇంజనీర్లు మరియు పారిశ్రామిక నిపుణులను సిద్ధం చేయడానికి హైదరాబాద్ ఐఐటి అనుబంధంతో పరిశ్రమ-విద్యాసంస్థల కార్యక్రమమైన 'అణుజ్ఞాన్ - న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది.

Advertisement

న్యూక్లియర్ రంగంలో స్వదేశీ సామర్ధ్యాలను బలోపేతం చేసే ప్రోగ్రామ్

హైదరాబాద్ ఐఐటి, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో నేటినుంచి ఉన్నత విద్య కోర్సును అందిస్తోంది. అణు ఇంజనీరింగ్ విద్య, కార్మిక శక్తి అభివృద్ధి, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలలో భారతదేశ స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందనీ హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.

మూడు నెలల రెసిడెన్షియల్ కోర్సుగా అణుజ్ఞాన్

ఈ కోర్స్ మూడు నెలల పూర్తి రెసిడెన్షియల్ కార్యక్రమంగా రూపొందించబడింది.. ఈ మూడు నెలల కోర్సు మూడు లక్షల 50 వేల రూపాయలు అవుతుంది. 'అణుజ్ఞాన్ ', ఐఐటి హైదరాబాద్ యొక్క విద్యా నైపుణ్యాన్ని, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్‌కు చెందిన సీనియర్ అణు నిపుణుల విస్తృత నైపుణ్యంతో మేళవించి, ఈ కోర్సులో జాయిన్ అయిన వారిని నైపుణ్యం కలిగిన వారిగా తయారు చేయడానికి కృషి చేస్తోంది.

Advertisement

ప్రత్యేక నైపుణ్యం గల ఇంజనీరింగ్ ప్రతిభకు డిమాండ్

2047 నాటికి తన అణు విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని సుమారు 8.8 గిగావాట్ల నుండి నుండి 100 గిగా వాట్లకి విస్తరించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, ప్రత్యేక నైపుణ్యం గల ఇంజనీరింగ్ ప్రతిభకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి 'అణుజ్ఞాన్ ' రూపొందించబడింది.

ఆధునిక అణు ఇంజనీరింగ్ పద్ధతులపై సమగ్రమైన అవగాహన

ఈ కోర్సులో రియాక్టర్ ఫిజిక్స్, థర్మల్ హైడ్రాలిక్స్, రేడియేషన్ షీల్డింగ్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు , అణు భద్రత, నాణ్యత హామీ, ఇంజనీరింగ్ డిజైన్, AERB నియంత్రణల అనుగుణ్యత, మరియు సాధారణ సిమ్యులేటర్ ఆధారిత శిక్షణ వంటి అంశాలు ఉంటాయి. ఆధునిక అణు ఇంజనీరింగ్ పద్ధతులపై సమగ్రమైన అవగాహనను ఈ కోర్సులో అందిస్తుంది. పీజీ, ఐఐటీ పూర్వ విద్యార్థులకు ఈ కోర్సులో ప్రవేశం కల్పించినట్లు తెలిపారు.

Advertisement
యువతకు తీపికబురు.. మీ కోసం కొత్తగా మరో 54 ఏటీసీలు!

ఈ కోర్సులో చేరేందుకు వీరికే అర్హత .. ప్రతిభ కనబరిస్తే ప్లేస్ మెంట్

ఈ కోర్సులో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మరియు ఇతర కోర్ ఇంజనీరింగ్ శాఖల వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హత కలిగి ఉన్నారు. మొత్తం ఈ కోర్సులో 35 మందికి మాత్రమే అవకాశం ఉంది కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ టెన్ 100% మిగతా వారికి కెరీర్ కౌన్సిలింగ్ ప్రముఖ కంపెనీల రిఫరెన్స్ అందజేస్తారు.

English Summary

Anugyan is an amazing specialized program that transforms ordinary engineers into expert nuclear engineers through advanced training in nuclear technology, reactor systems, safety and operations started in IIT Hyderabad.