జనగణమన ప్రజల గీతం- ఆ పొరబాటు వల్లే వందేమాతరం- ఓవైసీ షాకింగ్..!

వందేమాతరం గీతంలోని పూర్తి భాగాన్ని ఆలపించేలా, దీన్ని ఎవరైనా అతిక్రమించినా, అవమానించినా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తాజాగా ఓ బిల్లును ఆమోదించింది. లోక్ సభ, రాజ్యసభ రెండూ ఆమోదించిన వందేమాతరం బిల్లుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ రాజ్యసభలో బిల్లు ఆమోదం తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలో మాట్లాడిన ఓవైసీ.. షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
ప్రియాంక కామెంట్స్ బ్యాక్ ఫైర్- IIT డైరెక్టర్ కు మద్దతుగా 215 మంది వీసీలు, మేథావులు..!
Advertisement

మీరు 'జన గణ మన'ను ఆలపించినప్పుడు, అందులో ఈ దేశం, ఇక్కడి ప్రజలు కనిపిస్తారని, అదే 'వందేమాతరం' విషయానికొస్తే, అందులో దేవతామూర్తుల ఆరాధన ఇమిడి ఉంటుందని ఓవైసీ తెలిపారు. మరి దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఆ 'ముజాహిదీన్-ఎ-ఆజాదీ' (స్వాతంత్ర్య సమరయోధుల) గురించి మీరేమంటారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. 'జన గణ మన' గీతం ప్రజల కోసం రాశారని అసదుద్దీన్ ఓవైసీ గుర్తుచేశారు.

కాక్రోచ్ సక్సెస్ తో తెరపైకి మరో ఉద్యమం..! ఇన్ స్టా లో మిలియన్ల సపోర్ట్..!

1950లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఒక పెద్ద పొరపాటు చేశారని తాను భావిస్తున్నానని ఓవైసీ తెలిపారు. వందేమాతరాన్ని ఎలాంటి అధికారిక తీర్మానం చేయకుండానే జాతీయ గీతంగా ప్రకటించారన్నారు. వాస్తవానికి దీని కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించి ఉండాల్సిందన్నారు. జాతీయ గీతం అనే పదానికి నిర్వచనం ఎక్కడా లేదని ఓవైసీ గుర్తుచేశారు. కాబట్టి కేంద్రం ఈ విషయంలో రాజ్యాంగంలోని 25, 26, 29వ అధికరణలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.