బుధాదిత్య యోగం మొదలైంది.. 22రోజులు ఈ రాశులు పట్టిందల్లా బంగారం అవుతుంది!

ఆగస్టు 5, 2026 ముఖ్య గ్రహాల సంచారం ప్రభావం అన్ని రాశుల మీదా పడుతుంది. నేడు ఆగస్ట్ 5న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో బుధుడు ఆగస్ట్ 22 వరకు ఉంటాడు. కర్కాటక రాశిలో అప్పటికే ఉన్న సూర్యుడితో సంయోగం చెంది బుధాదిత్య యోగం ఏర్పరుస్తున్నాడు.

Advertisement

బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులవారికి శుభఫలితాలు

బుధాదిత్య యోగం కొన్ని రాశులవారికి ప్రత్యేక శుభఫలాలు ఇస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశితో పాటు మరో నాలుగు రాశులవారు భారీ లాభాలు, విలాసవంతమైన జీవితం, ధనాగమం పొందే అవకాశం ఉంది.ఈ యోగం సమయంలో ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించవచ్చు. ధనం సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయం. అయితే అనవసర ఖర్చులు నివారించి, పొదుపు చేయడం మంచిది.

Advertisement

కర్కాటక రాశి: ఈ రోజు మీకు అత్యంత శుభమైనది. ఆర్థికంగా పెద్ద లాభాలు కనిపిస్తాయి. కొత్త వాహనం, ఇల్లు లేదా విలాసవస్తువులు కొనుగోలు చేసే యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల సాధ్యం. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభిస్తాయి.ఇది వీరికి అదృష్ట సమయం.

సింహ రాశి: బుధాదిత్య రాజయోగం కారణంగా ధనలాభం, సంపద పెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి.వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసివస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Advertisement

తులా రాశి: బుధాదిత్య రాజయోగం కారణంగా నేడు తులారాశి వారికి అనూహ్య ధనాగమం ఉంటుంది. మాటల ద్వారా ప్రభావం చూపించి లాభాలు పొందవచ్చు. వ్యాపారం, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు వస్తాయి.

బృహస్పతి ఉదయంతో ఈ రాశులవారికి అన్ని విధాలా సంపదల వర్షం!

కన్యా రాశి: కన్యా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కారణంగా కలిసి వస్తుంది. విలాసవంతమైన జీవితం, ధనలాభం కనిపిస్తుంది. కొత్త అవకాశాలు, పెద్ద ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. సామాజిక గుర్తింపు పెరుగుతుంది. కొత్త ఆదాయమార్గాలు కనిపిస్తాయి. ఈ సమయంలో ధనార్జనకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

Advertisement

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

Budhaditya yoga: Mercury enters Cancer on 5 August 2026 and forms conjunction with the Sun for 17 days till 22 August. Know the impact of this Budhaditya Yog on zodiac signs.