నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. కెసిఆర్ కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బిఆర్ఎస్ పార్టీని తీవ్ర విషాదంలో ముంచింది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కెసిఆర్ స్వయంగా వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, భార్య పెద్ది స్వప్న తో మాట్లాడి భరోసా ఇచ్చారు.
పెద్ది సుదర్శన్ రెడ్డిపై కేసీఆర్ ప్రేమ
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన పెద్ది కుటుంబానికి కెసిఆర్ అండగా నిలవాలని నిర్ణయించారు. ఉద్యమ సహచరుడు, ఆప్త మిత్రుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోయానని పేర్కొన్న మాజీ సీఎం కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డిపైన తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ద స్వప్న, వారి పిల్లల చదువులకు సంబంధించి కెసిఆర్ స్పష్టమైన ప్రకటన చేసినట్టు సమాచారం.
పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లలు కుమారుడు నిదర్శన రెడ్డి, కుమార్తె ధర్మిష్టా రెడ్డి ఉన్నత చదువులకు అయ్యే పూర్తి ఖర్చులను, వారి చదువుల బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భరిస్తుందని కెసిఆర్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఉద్యమకారుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఏమి సంపాదించుకోలేదని, ఇప్పటికీ ఆయనకు అప్పులే ఉన్నాయని, ఇంటి లోన్, హాస్పిటల్ బిల్ అన్ని తానే చూసుకుంటానని కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రజాసేవ కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన అప్పులన్నింటినీ పార్టీ తరపున తామే తీరుస్తామని, వారి కుటుంబం పైన ఆర్థిక భారం పడకుండా చూసుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు ఆసుపత్రికి వెళ్లిన నాడే జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబ పెద్దగా, పెద్ది కుటుంబానికి తండ్రిగా అండగా ఉంటానని పెద్ది స్వప్నకు భరోసా ఇచ్చారని సమాచారం. అంతేకాదు పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గం నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా కెసిఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా కెసిఆర్ తన ఉద్యమ సహచరుడు, ఆప్త మిత్రుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తన పెద్ద మనసు చూపించాడు.ఇంటి లోన్, హాస్పిటల్ బిల్ అన్నీ తానే చూసుకుంటానన్న కేసీఆర్
తండ్రిలా కుటుంబానికి అండగా ఉంటానని కేసీఆర్ హామీ
హెలిప్యాడ్‌తో.. టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో.. తెలంగాణాలో ఆ పండ్ల మార్కెట్!
వచ్చే ఎన్నికల్లో పెద్ది స్వప్నకు బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే టికెట్