వరద గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక.. ఆ గ్రామాలకు రాకపోకలు బంద్!

ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువ నుండి వస్తున్న వరదల కారణంగా గోదావరి నది ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది వరద పెరగడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 15.82మీటర్ల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు.ప్రస్తుతానికి 16.55 మీటర్లకు వరద నీరు చేరడంతో అధికారులు,చుట్టు పక్క గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, భద్రాద్రి వద్ద ఇలా

కాగా వరద నీరు 17.32 మీటర్లకు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి నుంచి వస్తున్న వరదనీటి కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

ఏపీలోనూ గోదావరి వరద ఉధృతి

ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో గోదావరి పరిస్థితి ఇలా ఉండగా, ఏపీలోనూ గోదావరి వరద ఉధృతి కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది క్రమంగా ఉగ్రరూపం దాలుస్తోంది. దేవీపట్నంలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయ గోపురం వద్దకు నదీ నీరు చేరటంతో ఈ ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.

పాపికొండలు విహార యాత్ర నిలిపివేత, ఆ గ్రామాలకు రాకపోకలు

వరద ఉధృతి ఎక్కువగా ఉండటం కారణంగా అధికారులు పాపికొండలు విహార యాత్రను నేటి నుండి నిలిపివేశారు. ఇదిలా ఉంటే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి సుమారు 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయ తాత్కాలిక గట్టు తెగి పోవటం కారణంగా నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement
వాహనదారులకు అలెర్ట్.. ఈ కోర్సు పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్!

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టంపై అలెర్ట్

లంక గ్రామాల ప్రజలు స్థానిక పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. కాగా తూర్పు గోదావరి, పోలవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం వరద పరిస్థితుల నేపధ్యంలో అప్రమత్తం అయ్యింది. వరద స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరం అయిన చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నారు.

English Summary

Godavari floods: Godavari river turns fierce in East Godavari. Water reaches Gandipochamma temple in Devipatnam. Dowleswaram barrage releases 2.25 lakh cusecs. Papikondalu tourism suspended. Flood cuts off villages in Konaseema.