టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు తీపికబురు .. మళ్లీ రోడ్డెక్కుతున్న ఆ బస్సులు

తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రయాణాలు చేసే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది తెలంగాణా ఆర్టీసీ. టి జీ ఎస్ ఆర్ టి సి ఇటీవల నిలిపివేసిన వెయ్యి బస్సులను మళ్లీ రోడ్డు ఎక్కించే పనిలో ఉంది. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రవాణా సేవలను అందించడానికి నిర్ణయం తీసుకున్న టీజిఎస్ ఆర్ టి సి తాము భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

మళ్ళీ ఆ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్న jbm ఎలక్ట్రిక్ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సులను తాత్కాలికంగా నిలిపివేసింది ఆర్టీసీ. సదరు జేబీఎం కంపెనీకి బస్సుల యొక్క భద్రతను తనిఖీ చేయాలని, బ్యాటరీలను చెక్ చేయాలని, సాంకేతిక లోపాలను పూర్తిగా పరిశీలించి, భద్రతా నిబంధనలను అన్నిటినీ పాటించిన తర్వాత, తిరిగి ఆర్టీసీ చెక్ చేసుకుని ఈ బస్సులను మళ్లీ నడుపుతోంది.

Advertisement

దశలవారీగా రోడ్డెక్కుతున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు

భద్రతా తనిఖీలు పూర్తి చేసిన తర్వాత దశలవారీగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తోంది. గత వారం రోజులుగా ఈ బస్సులు డిపోలకే పరిమితమై ఉన్నాయి. దీంతో ఆయా రూట్లలో ప్రయాణికులు బస్సుల కోసం చాలా ఇబ్బంది పడ్డారు. జులై రెండవ తేదీ నుంచి బ్యాటరీలో లోపాలు, మంటలు చెలరేగిన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ బస్సు సర్వీసులను సస్పెండ్ చేసిన ఆర్టీసీ తిరిగి పూర్తి భద్రత తనిఖీలను నిర్వహించిన తర్వాత బస్సులకు క్లియరెన్స్ ఇస్తోంది.

పూర్తి భద్రత పరీక్షలు పూర్తిచేసి త్వరలోనే అందుబాటులోకి

తాజాగా 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం దీంతో రాష్ట్రవ్యాప్తంగా 268 బస్సులు వివిధ రూట్ లలో నడుస్తున్నాయి. ఇంకా టీజీఎస్ ఆర్టీసీ వద్ద ఉన్న బస్సులను కూడా పూర్తి భద్రత పరీక్షలు పూర్తిచేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అన్ని విధాలుగా సేఫ్ అని నిర్ధారించుకున్న తర్వాతనే వీటిని మళ్లీ రోడ్లపైకి తెస్తున్నట్టు గా అధికారులు చెబుతున్నారు.

English Summary

TGSRTC resumes JBM electric buses on roads after safety inspections. Present 268 buses back in service. another 500 buses will be on roads shortly. the buses have battery and fire concerns and the companysolved these technical problems. Relief for passengers in Telangana.