హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మెట్రో రైల్ విస్తరణ పనులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రెండవ దశలో భాగంగా ఎంజీబీఎస్ నుండి ఫలక్నుమా వరకు మెట్రో కారిడార్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టిన పనుల పైన హైకోర్టులో పిటిషన్ లు దాఖలు కావడంతో తెలంగాణ హైకోర్టు దీనిని విచారిస్తోంది.
నాలుగో కారిడార్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోర్టులో పిటీషన్
తాజాగా తెలంగాణ హైకోర్టు ఈనెల 24వ తేదీ వరకు ఈ విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్ లోని వారసత్వ కట్టడాలకు నష్టం చేకూరుస్తూ, ప్రతికూలంగా ఉంటుందని ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా శంషాబాద్ వరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నాలుగో కారిడార్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్ తోపాటు మరొకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ లతో కూడిన బెంచ్ నిన్న ఈ కేసును విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ఎటువంటి చారిత్రక కట్టడాలను ధ్వంసం చేయడం లేదని పేర్కొన్నారు. ఆలయాలు, మసీదులు, చిల్లాలు, దర్గాలు, సమాధులు సహా మొత్తం 102 నిర్మాణాలు మెట్రో లైన్ కింద ఉన్నాయని, అయితే రైల్వే ట్రాక్ నిర్మాణం వాటిని తాకటం లేదని స్పష్టం చేశారు. వారసత్వ కట్టడాల రక్షణ పైన తగిన చర్యలు తీసుకోకుండా పనులు కొనసాగిస్తే చారిత్రక నిర్మాణాలకు నష్టం వాటిల్లుతుందని ఆయన కోర్టులో బలంగా వాదించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు బెంచ్ విచారణను ఆగస్టు 24వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఈ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి స్థానిక ప్రజలలో ఉంది.చారిత్రక కట్టడాలను ధ్వంసం చేయడం లేదని వాదన
మెట్రో లైన్ కింద 102 నిర్మాణాలు, వాటికి ఎలాంటి నష్టం లేదన్న సర్కార్
పిటిషనర్ల తరపున న్యాయవాది రామారావు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ గొట్టం తప్పుదోవ పట్టిస్తుందని, ఈ మెట్రో రైల్వే లైన్ కింద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి అడ్వకేట్ కమిషన్ను నియమించాలని ఆయన కోర్టును కోరారు.తెలంగాణాకు రైల్వే భారీ వరాలు.. రూ.48వేల కోట్లతో 21 ప్రాజెక్టులు, లెక్క ఇదే!
ఆగస్టు 24వ తేదీకి విచారణ వాయిదా