కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి.. స్థానికులకు ఉద్యోగాలపైన శుభవార్త!

ఎంతో కాలంగా కాజీపేట వాసులు ఆశగా ఎదురు చూస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పైన శుభవార్త వచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్య పురం లోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు పనులు పూర్తిగా వస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ వెల్లడించారు.

Advertisement

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించిన రైల్వే బోర్డు చైర్మన్

దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ వాస్తవ తో కలిసి చైర్మన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇక్కడ కొత్త తరం కోచ్ లు తయారవుతాయని, ఇందులో స్థానికులకు ఉద్యోగాల కల్పన పైన చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ఫ్యాక్టరీ ప్రాంగణమంతా కలియతిరిగిన ఆయనకు నిర్మాణ ప్రగతి, షెడ్ ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన పైన అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిస్థాయి సమాచారాన్ని అందించారు.

Advertisement

రైల్వే కోచ్ ల తయారీకి, వ్యాగన్ల మరమ్మతులకు అవసరమైన ఏర్పాట్లు

అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన కాజీపేట ఆర్ఎంయూ లో విభిన్న రకాల రైల్వే కోచ్ ల తయారీకి, వ్యాగన్ల మరమ్మతులకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక భారీ యంత్రాలు, సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక యువతకు లభించే ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన పైన తమ ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉన్నత స్థాయి సమీక్ష

ఉద్యోగ , ఉపాధి అవకాశాలపై స్థానిక అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దేశీయంగా రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ పర్యటనలో భాగంగా కాజీపేట అమృత్ భారత్ పనులు, సిగ్నల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో 4.0 సాంకేతికత అమలు తీరును రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ సమీక్షించారు.

Advertisement

రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన రైల్వే బోర్డు చైర్మన్

రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను అక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వసతులు, ప్లాట్ ఫామ్ ల నిర్వహణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని తెలుసుకొని పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

English Summary

kazipet railway coach factory: Railway Board Chairman Satish Kumar announced that production at the Railway Coach Factory would commence soon. He inspected the construction work.