బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని తెలంగాణ మంత్రులు సూచించారు. నీళ్ల గురించి తెలియని కేటీఆర్‌కు అదే మంచిదని తెలంగాణ మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై అవగాహన లేని కేటీఆర్, హరీశ్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు రావొద్దని బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం కోరుకుంటోందని విమర్శించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి మంత్రుల పరిశీలన
నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతుండడంతో పరిశీలించేందుకు తెలంగాణ మంత్రులు నిర్మల్ జిల్లాకు వచ్చారు. మొదట నిర్మల్ సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనానికి చేరుకున్న మంత్రులు అనంతరం రోడ్డు మార్గం ద్వారా నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ నీటి మట్టం, ఇన్ ఫ్లోలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వంపై భారం పడింది. 60 టీఎంసీల నీటిని వృథా కావడంతో సుమారు రూ.3 వేల కోట్ల నష్టం మిగిల్చారు. కేటీఆర్‌కు ప్రాజెక్టులపై అవగాహన లేదు. కేటీఆర్ మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకోవడం మంచిది' అని హితవు పలికారు. కేటీఆర్, హరీశ్ రావు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వివేక్ విమర్శించారు. వర్షాలు రాకూడదని బీఆర్ఎస్ నాయకులు కోరుకున్నారని మండిపడ్డారు.ఈ సందర్భంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది' అని స్పష్టం చేశారు. తామే కట్టామంటూ బీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని.. వాళ్లు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని విమర్శించారు. 'ప్రాజెక్టుల్లో పూడిక తీయడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఎస్సారెస్పీకి పూర్వవైభవం తీసుకువస్తాం' అని ప్రకటించారు. త్వరలోనే ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు సాగునీటిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. శ్రీరాంసాగర్‌లో క్రమంగా వరద పెరుగుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 84,950 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1,091 అడుగులు (80 టీఎంసీలు).. ప్రస్తుతం 1,071.8 అడుగులకు (27.369 టీఎంసీలు) నీటి మట్టం ఉంది. ఇదే ప్రవాహం కొనసాగితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిండుకుంటుండడంతో ఆయకట్టు రైతులు ఆనందంలో మునిగారు.టార్గెట్ కేటీఆర్ అంటున్న తెలంగాణా మంత్రులు
కేటీఆర్ పై మంత్రుల సెటైర్లు
అన్నీ తామే కట్టామని బీఆర్ఎస్ చెప్పుకోవటం విడ్డూరం
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం వేళ వైఎస్సార్‌సీపీ వరుస ట్వీట్లు,!
శ్రీరాంసాగర్‌కు భారీ వరద