నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిన పెద్ది సుదర్శన్ రెడ్డిని హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు
ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యవసర వైద్యచికిత్స కొనసాగుతుంది. ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. తాజాగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డికి వచ్చింది హార్ట్ ఎటాక్ కాదని పేర్కొన్నారు.
ఊపిరితిత్తుల సమస్య వల్ల ఈ విధంగా జరిగిందని ఆయన వెల్లడించాడు. గత 20 రోజులుగా హిమోగ్లోబిన్ సంబంధిత మాత్రలు వాడకపోవడంతో హిమోగ్లోబిన్ శాతం పెరిగి, ఊపిరితిత్తుల నుండి గుండెకు వెళ్లే వాల్వ్ లో బ్లాక్ ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావం గుండె పైన పడిందని, పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన రోజు 30 నుండి 40 నిమిషాలు గుండె ఆగిపోయి, మెదడుకు ఆక్సిజన్, రక్త సరఫరా నిలిచిపోయిందని అన్నారు. ప్రస్తుతం తమ పెద్ది సుదర్శన్ రెడ్డి ని బ్రతికించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్, ముంబై, అమెరికా, లండన్ టాప్ డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రిపోర్ట్ లు అమెరికాకు పంపించామని అన్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ప్రతిరోజు ఆసుపత్రి వద్ద ఉంటున్నానని అన్నారు. అయినప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి చెప్పలేని స్థితిలో ఉందన్నారు. వైద్యులు, ఫ్యామిలీనే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని అన్నారు. అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు రావద్దన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. మానవ ప్రయత్నంగా తాము చేయగలిగింది చేస్తున్నామన్నారు మాజీమంత్రి హరీష్ రావు.హిమోగ్లోబిన్ సంబంధిత మాత్రలు వాడకపోవడంతోనే ఇలా
లండన్, అమెరికా టాప్ డాక్టర్ లతో సంప్రదింపులు జరుపుతున్నాం
వర్షాలు, వరదలతో నదులు, రిజర్వాయర్ లకు జలకళ.. తెలంగాణా వ్యాప్తంగా తాజా పరిస్థితి ఇదే
ఫ్యామిలీనే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి