సహజంగా రేషన్ షాపులకు వెళితే రేషన్ ఇచ్చే సమయంలో బియ్యం తూకం వేసి లబ్ధిదారులకు అందిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో మాత్రం బియ్యానికి బదులు రాళ్లను తూకం వేసి ఇచ్చి పంపుతారు. వినడానికి చాలా వింతగా అనిపించినప్పటికీ ఇది ప్రతి నెల జరిగే తంతే..
ప్రతీ నెల బియ్యానికి బదులు రాళ్ళతూకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కారే గట్టు, సారే కల్లు గ్రామాల ప్రజలు ప్రతినెలా బియ్యానికి బదులు రాళ్ళను తూకం వేయించుకొని రేషన్ కోసం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కాదు. అసలు ఇంతకు అక్కడ సమస్య ఏమిటి? వారి సమస్యకు పరిష్కారం ఏమిటి?
కారే గట్టు, సారే కల్లు పంచాయతీ పరిధిలో సుమారు 900మంది జనాభా, 183 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డు దారులు రేషన్ తీసుకోవాలంటే సెల్ఫోన్ సిగ్నల్స్ ఆ గ్రామాలలో ఉండకపోవడం కారణంగా నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వ రేషన్ పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయడంతో, సిగ్నల్ లేకపోవడంతో డీలర్లు గ్రామస్తులు కలిసి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండి కట్ట అనే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ సిగ్నల్ వెతుక్కుని లబ్ధిదారుల వేలిముద్రల సేకరణ జరుగుతుంది. ఇక సాంకేతిక నియమాల ప్రకారం రేషన్ కార్డు యాక్సెస్ కావాలంటే లబ్ధిదారునికి ఎంత బియ్యం ఇవ్వాలో అంత బరువును కాంటా పైన తూకం వేయాల్సి ఉంటుంది. ఇక రేషన్ బియ్యాన్ని రేషన్ షాప్ నుండి ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లడం పౌరసరఫరాల నిబంధనల ప్రకారం తప్పు. ఈ క్రమంలో రేషన్ డీలర్లు బియ్యానికి బదులుగా అంతే బరువు ఉన్న రాళ్ళను కాంటా పైన తూకం వేసి, సిస్టంలో నమోదు చేసి రసీదులు ఇస్తారు. ఆ తర్వాత ఆ రసీదులు తీసుకువెళ్లి గ్రామంలో ఉన్న వ్యక్తికి ఇచ్చి వాటి ఆధారంగా అసలు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ రెండు రోజులు సమయం కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు రెండు రోజులు తమ పనులు వదిలి పెట్టుకొని రేషన్ బియ్యం కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వారు సెల్ఫోన్ టవర్ లేకపోవడం వల్లనే ఇబ్బంది వస్తుందని, గ్రామంలో సెల్ఫోన్ టవర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డిజిటల్ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని వారు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.రేషన్ కావాలంటే రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్ళాల్సిందే
సిగ్నల్ వెతుక్కుని వేలిముద్రల సేకరణ
బియ్యానికి బదులుగా అంతే బరువు ఉన్న రాళ్ళకాంటా
హైదరాబాదీలకు పండుగలాంటి వార్త.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ కోసం ఈ రూట్లలో నయా ప్లాన్!
రేషన్ బియ్యం కోసం యుద్ధం.. ఇలా చెయ్యండి ప్లీజ్