పార్టీలు వేరైనా సరే సీతక్క చంద్రబాబుల అనుబంధం.. సీతక్క పుట్టినరోజు స్పెషల్!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పార్టీలు మారినా, వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయనటానికి తెలంగాణ మంత్రి సీతక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న అనుబంధం ఉదాహరణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు.

Advertisement

సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గారికి జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్న చంద్రబాబు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. సీతక్క ప్రతీ పుట్టినరోజుకు చంద్రబాబు శుభాకాంక్షలు తప్పక చెప్తారు.

Advertisement

సీతక్కకు లోకేష్ శుభాకాంక్షలు

ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల గొంతుకాగా నిలిచిన సీతక్క జీవితం ఎందరికో స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న ఆమె నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని లోకేష్ ట్వీట్ చేశారు. పార్టీలు, రాష్ట్రాలు వేరైనా చంద్రబాబు సీతక్కల మధ్య గౌరవం, అభిమానం ఎప్పటిలానే కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా వారి అనుబంధం నిలిచిందని తాజా చంద్రబాబు పోస్టుతో ఆసక్తికరచర్చ జరుగుతోంది.

చంద్రబాబు, సీతక్కకు విషెస్ చెప్పటం సత్సబంధాలకు నిదర్శనం

కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సీతక్క చంద్రబాబును తన రాజకీయ గురువుగా భావించి, రాఖీ పండుగకు చంద్రబాబు ఇంటికి వెళ్లి రాఖీ కట్టడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సీతక్క జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అని ఎటువంటి భేద భావం లేకుండా చంద్రబాబు అదే తరహాలో ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం వారి సత్సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తుంది.

Advertisement

పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలు గౌరవంగా ఉండాలి

పార్టీలు వేరైనా, పార్టీలు సిద్ధాంతపరంగా విభేదించినా వ్యక్తిగతంగా ఉండే అనుబంధాలు శాశ్వతంగానే ఉంటాయని వీరి బంధం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తుంది. ఇలాంటి గౌరవ పూర్వకమైన సంబంధాలు పార్టీల నేతల మధ్య ఉండడం చాలా ముఖ్యం అన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తం అవుతుంది.

English Summary

seethakka chandrababu special bond: The special bond between Telangana Minister Seethakka and Andhra Pradesh CM Chandrababu. latestly chandrababu wishes to seethakka on her birthday. Despite different political parties, their mutual respect, affection and guru-shishya relationship continues strongly.