జిల్లాలకు చేరిన స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే!

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని , మెరుగైన రేషన్ పంపిణీ విధానంలో భాగంగా నిర్ణయం తీసుకున్న సర్కార్ ఏటీఎం కార్డుల తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వనుంది.

Advertisement

ఏటీఎం కార్డుల తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు

ఇప్పటివరకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు దారులు కాగితపు రేషన్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అవి పాడవటం, చినిగిపోవటం వంటివి జరుగుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా రేషన్ లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా పీవీసీతో ఏటీఎం కార్డుల తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వనున్నారు.

Advertisement

పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులపై వివరాలు ఇలా

నాణ్యమైన, భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ స్వయంగా తయారు చేయించి, ఇప్పటికే జిల్లాలకు చేర్చింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ రేషన్ కార్డులలో ముందుభాగంలో కార్డు యజమాని ఫోటో, కార్డు నెంబర్ ముద్రించి ఉంటాయి. వెనుకవైపు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ అనుసంధాన సమాచారం వస్తుంది.

రేషన్ అక్రమాలు, దళారుల జోక్యానికి చెక్

అంతేకాదు ఈ కార్డులతో వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ సాంకేతికతతో అనుసంధానం కావటంతో రేషన్ అక్రమాలు, దళారుల జోక్యం బాగాతగ్గుతాయి. ఇది మాత్రమే కాదు వన్ నేషన్ వన్ రేషన్ విధానం క్రింద లబ్దిదారులు దేశంలో ఎక్కడైనా సరుకులు పొందే సౌలభ్యం పొందుతారు. ప్రస్తుతం ఉన్న లబ్దిదారులు, దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా ఈ కార్డులను ముద్రించి సిద్ధం చేశారు.

Advertisement
ఇంజనీర్లకు భారీ శుభవార్త.. మన ఐఐటీ హైదరాబాద్ లో మీకోసం గొప్ప అవకాశం!

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అప్పుడే

ఈ కార్డులు పంపిణీకి సిద్ధం కాగా, ప్రభుత్వం నుండి అధికారిక తేదీలు, తుది మార్గదర్శకాలు వచ్చిన వెంటనే డీలర్లు, ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మొత్తంగా ఈ విధానంతో రేషన్ లబ్దిదారులకు పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ అందనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని లబ్దిదారులకు రేషన్ తీసుకోవటం ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నెలలో మూడునెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నారు .

English Summary

smart ration cards: Telangana government ready to distribute PVC Smart Ration Cards replacing old paper ones. Features QR code, biometric linkage, photo and supports One Nation One Ration for transparent and fraud-free public distribution system.