కన్నతల్లిపై కామంతో లైంగికదాడి చేసిన కొడుకు.. సమాజానికి షాక్!

మానవ సంబంధాలకు, అనుబంధాలకు అర్ధం లేని, సభ సమాజం సిగ్గుతో తల దించుకునే అత్యంత దారుణ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లో చోటు చేసుకుంది. నవ మాసాలు మోసి కనీ పెద్ద చేసిన కొడుకు కన్నతల్లి పైనే కామంతో కళ్ళు మూసుకుపోయి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సమాజాన్ని షాక్ కు గురి చేసింది.

ఇళ్ళలో పనిచేసుకుంటూ జీవిస్తున్న మహిళపై కొడుకు అమానుషం

కన్నతల్లిపైనే దారుణానికి పాల్పడిన కొడుకుపై ఆ తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 56సంవత్సరాల ఒక మహిళ జీవనోపాధి కోసం గత కొంత కాలం క్రితం హైదరాబాద్ కు వలస వచ్చింది. ప్రస్తుతం ఆమె ఘట్కేసర్ లోని ఒక భవనం సెల్లార్లో నివసిస్తూ స్థానికంగా ఉంటున్న ఇళ్లల్లో పనిచేస్తుంది.

మద్యం మత్తులో తల్లితో గొడవ, ఆపై లైంగిక దాడి

అయితే ఆమె మొదటి భర్తకు పుట్టిన రెండో కుమారుడు 25 సంవత్సరాల విజయ్ గత రెండు నెలలుగా తల్లి వద్దే ఉంటున్నాడు . తల్లితో తరచూ గొడవ పడుతున్నాడు. మద్యం సేవించి వచ్చి తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 3వ తేదీన రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన విజయ్ తల్లితో గొడవకు దిగాడు. ఆ తర్వాత తల్లి పైన లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

తప్పించుకునే ప్రయత్నం చేసినా మళ్ళీ తనయుడి లైంగిక దాడి, కేసు నమోదు

కొడుకు నుండి తప్పించుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ తల్లిని విజయ్ బెదిరింపులకు గురి చేసి మరీ మళ్లీ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు చెప్పి లబోదిబోమంది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిపైన సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

English Summary

son sexual abuse on mother:A shocking incident involving a son sexually assaulting his mother while under the influence of alcohol has occurred in Ghatkesar, Medchal-Malkajgiri district.