సవతి కొడుకుతో పాడుపని.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే సుపారీ ఇచ్చి మరీ హత్య

తెలంగాణ రాష్ట్రంలో అనైతిక సంబంధాలు వ్యక్తుల ప్రాణాలను తీస్తున్నాయి. ఎవరూ ఊహించని అక్రమ సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ దిగ్భ్రాంతి కలిగించే హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సవతితల్లి తన కొడుకుతో ఏర్పరచుకున్న అక్రమ సంబంధం చివరికి ఆ యువకుడు ప్రాణాలను తీసింది. పెళ్లి చేసుకుని వేరే జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలి అనుకున్న ఆ యువకుడిని సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించిన ఘటన చోటుచేసుకుంది.

Advertisement

సవతి తల్లితో అక్రమ సంబంధం

ఈ ఘటన వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ అస్లాం ఖాన్ తండ్రి 17 సంవత్సరాల క్రితం అన్వరీ బేగం ను రెండవ పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలంగా సవితి తల్లి సవితి కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఇటీవల ఆ యువకుడు తమ సంబంధానికి స్వస్తి చెప్పి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నాడు.

Advertisement

యువకుడిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించిన సవతి తల్లి . గుట్టు రట్టు

ఈ క్రమంలో అతడిని పెళ్లి చేసుకోవద్దని ఒత్తిడి తెచ్చిన సవతి తల్లి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానంటూ అతడిని ఆపే ప్రయత్నం చేసింది. వినకపోతే చంపేస్తానని బెదిరించింది.
ఈ క్రమంలో ఆమె ఒత్తిడి తట్టుకోలేకపోయిన యువకుడు తన బాబాయికి విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులకు, బంధువులకు విషయం తెలిసి అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి.

సవతి కొడుకుని చంపేందుకు సుపారీ గ్యాంగ్

ఆ తర్వాత అస్లాం నిర్మల్ లోని వైయస్సార్ కాలనీలో ఉండే తన బాబాయి ఇంటికి మకాం మార్చి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన విషయం బయటకుచెప్పి అందరి ముందు పరువు తీశాడని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడన్న కక్షతో అన్వరీ బేగం మహారాష్ట్రకు చెందిన సుఫారీ గ్యాంగ్ ను పిలిపించి హత్యకు ప్లాన్ చేసింది. ఆరులక్షల రూపాయలకు సుపారి మాట్లాడి, 50వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చింది.

Advertisement

కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన సుపారీ గ్యాంగ్

తన సొంత తమ్ముడు షేక్ మహమ్మద్ ను కూడా ఈ నేరంలో భాగస్వామిని చేసింది. అస్లాం ఫోటోలు, ఆటో నెంబర్ తో పాటు, అతని కదలికలను ఎప్పటికప్పుడు సుపారీ గ్యాంగ్ కి చెప్పి హతమార్చాలని సూచించిందిఈ క్రమంలో జూలై 15వ తేదీన వైయస్సార్ కాలనీ వద్ద అస్లాం ఆటోలో ప్రయాణికులతో వస్తుండగా సుపారీ గ్యాంగ్, కారులో అస్లాం ను అడ్డుకొని ఆటోలో నుండి బయటకు లాగి కత్తులతో పొడిచి పారిపోయారు.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఉత్తరాది రాష్ట్రాలకు దూసుకుపోయేలా కొత్త రైల్వేలైన్ రెడీ!
Advertisement

నేరం అంగీకరించిన సవతి తల్లి

అస్లాం ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అస్లాం మృతి చెందాడు. ఈ హత్య పై ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణ నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగించగా, ప్రధాన కుట్రదారు అన్వరీ బేగంగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించి సూపర్ గ్యాంగ్ వివరాలు బయటపెట్టింది.

English Summary

step mother killed step son for illegal affair: Shocking murder in Nirmal district where a stepmother hired killers to murder her stepson over an illicit relationship and his plan to marry. Full details of the crime and arrests.