బుల్లెట్ రైల్ కారిడార్ లపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!


భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం రెడీ అవుతున్న తెలంగాణ కీలకమైన అడుగు వేసింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కీలకమైన హై స్పీడ్ రైల్వే హబ్ గా రూపాంతరం చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు భారీ బుల్లెట్ రైలు కారిడార్ లకు హైదరాబాద్ ప్రధాన కూడలిగా మారుతుంది.

Advertisement

శంషాబాద్ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్ డిపో కోసం 400 ఎకరాల భూమి

పక్క రాష్ట్రాలలోని ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ కేంద్రం రూపొందించిన హై స్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్ లు, స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శంషాబాద్ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్ డిపో కోసం 400 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది.

Advertisement

తుది అలైన్మెంట్ లకు, స్టేషన్లు, డిపోలపై కీలక నిర్ణయాలు

హై స్పీడ్ రైలు కారిడార్ లకు అనుగుణంగా తుది అలైన్మెంట్ ను హెచ్ఎండిఏ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ లో కూడా చేర్చాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీ ల మార్పు, వివిధ శాఖల అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కు ప్రతిపాదనలు పంపనున్న సర్కార్

ప్రతిపాదిత మూడు ప్రధాన రైలు కారిడార్ల అలైన్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కు పంపించనుంది. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే మూడు కారిడార్ల అలైన్మెంట్ కు ఆమోదం తెలిపిన క్యాబినెట్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అలైన్మెంట్ లు, స్టేషన్లు, డిపోలను నిర్ణయించింది.

Advertisement

తెలంగాణాలో 512 కిలోమీటర్ల హై స్పీడ్ రైల్వే ట్రాక్

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 512 కిలోమీటర్ల హై స్పీడ్ రైల్వే ట్రాక్ ఉండనుంది. హైదరాబాద్ చెన్నై ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ మొదటి నార్కెట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ప్రతిపాదిస్తే రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఫ్యూచర్ సిటీ, నాగార్జునసాగర్ వైపు అలైన్మెంట్ ని మార్చారు.

ఆ స్టార్ హోటల్స్ కు బిగ్ షాక్.. కోర్టుకెళ్ళి మరీ 20లక్షల జరిమానా వేయించుకున్నారుగా!

అలైన్మెంట్ లు ఇలా

ఇక హైదరాబాద్ బెంగళూరు మార్గం తొలుత మహబూబ్నగర్ వనపర్తి రోడ్డు వైపు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో ఫ్యూచర్ సిటీ, మన్ననూరు, సోమశిల వైపు అలైన్మెంట్ ను మార్చారు. ఇది శ్రీశైలం మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారు. ఇక హైదరాబాద్ పూణే ముంబై రైలు కారిడార్ ను హైదరాబాద్లోని శంషాబాద్, సైబరాబాద్, వికారాబాద్ మీదుగా అలైన్మెంట్ చేశారు. కేంద్రం ఇస్తున్న హై స్పీడ్ రైలు ప్రాజెక్టులను రాష్ట్ర పురోగతికి వినియోగించుకునే క్రమంలో ఈ కీలక అడుగును రాష్ట్ర ప్రభుత్వం వేసింది.

English Summary

Telangana bullet train projects: The State Cabinet has approved revised proposals regarding the alignment, stations, and depots for high-speed rail corridors designed by the Centre to connect major cities in neighboring states. It decided to allocate 400 acres of land near Shamshabad for a major railway station and depot.