యువతకు తీపికబురు.. మీ కోసం కొత్తగా మరో 54 ఏటీసీలు!

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకు శుభవార్త చెప్పబోతోంది. పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఏర్పాటుచేసి యువతకు పారిశ్రామిక శిక్షణ అందిస్తున్న తెలంగాణ సర్కార్ కొత్తగా మరో 54 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే తొలి దశలో 65 ప్రభుత్వ ఐటిఐ లను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసింది.

Advertisement

రెండో దశలో మరో 54 ఏటీసీ కేంద్రాలు మంజూరు

ఇప్పుడు రెండో దశలో మరో 54 కేంద్రాలను మంజూరు చేయడంతో మొత్తం ఈ సంఖ్య 119కి చేరుకోనుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఏటీసీ చొప్పున ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కొత్త ఏటిసిలను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలోని ఏర్పాటు చేస్తుంది. దీంతో వ్యవసాయ ఆధారితమైన రూరల్ అర్బన్ పరిధిలో వీటి సంఖ్య 89కి చేరుకుంటుంది.

Advertisement

గ్రామీణ యువతకు ఆధునిక పారిశ్రామిక నైపుణ్యాలు

రేర్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఈ ఏటీసీలు గ్రామీణ యువతకు పారిశ్రామిక ఆధారిత ఆధునిక శిక్షణను అందిస్తాయి. వ్యవసాయం గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న 28 జిల్లాలలో తొలిదశలో 45 ఏటీసీలు ఉండగా, రెండవదశలో మరో 44 ఏర్పాటు కానున్నాయి. దీని కారణంగా గ్రామీణ యువతకు ఆధునిక పారిశ్రామిక నైపుణ్యాలు, కొత్త కోర్సులు సులభంగా అందుబాటులోకి వస్తాయి.

ఐటీసీల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం

ప్రస్తుతం ఉన్న అన్ని ఏటీసీలు ప్రభుత్వ ఐటిఐ లే . అయితే వాటికి అనువైన స్థలాలు ఉండడంతో టాటా టెక్నాలజీస్ సంస్థ ఏటీసీల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం కొత్తగా రానున్న 54 కేంద్రాల్లో, 42 చోట్ల అవసరమైన భూములను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వీటి నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. కొన్నిచోట్ల భూములు అందుబాటులో ఉన్నప్పటికీ స్థల వివాదాలు ఉన్నాయి. ఇక భూముల అందుబాటులో లేని చోట్ల మిగిలిన స్థలాలను గుర్తించే ప్రయత్నాలు ప్రభుత్వం కొనసాగిస్తుంది.

Advertisement
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆయన గదిలో విస్తుపోయేలా

పారిశ్రామిక ఆధారిత ఆధునిక శిక్షణ అందించి ఉపాధి

ఈ కొత్త ఏటీసీల నిర్మాణం రాష్ట్రంలో 12,932 సీట్లు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులకు పారిశ్రామిక ఆధారిత ఆధునిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంచటమే ప్రభుత్వ లక్ష్యం గా ఈ ఏటీసీల ఏర్పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని యువత నైపుణ్యాలు పెంపొందించుకొని పారిశ్రామికంగా మెరుగైన అవకాశాలు సొంతం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

English Summary

telangana new ATCs: Telangana government approves 54 new Advanced Technology Centres (ATCs) in second phase to modernise ITIs. Total ATCs to reach 119 with focus on rural areas, adding 12,932 more seats for skill training.