తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త పింఛన్లు పంపిణీపైన కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం కింద అర్హులైన వివిధ వర్గాల వారికి ఆగస్టు 15వ తేదీ నుండి కొత్త పింఛన్లు అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తో కలిసి సమీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పింఛన్ల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వారికి పించన్లు మంజూరు చెయ్యాలని సీఎం రేవంత్ ఆదేశం
ఈ ఆగస్టు 15 నుండి తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒంటరి మహిళలు, వితంతువులు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని సూచించారు. దివ్యాంగులు మరణించిన సందర్భంలో వారి భార్యలకు వెంటనే పింఛన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అర్హులైన వారిని వెంటనే గుర్తించి పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన తెలిపారు. పేద బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్న సీఎం ఈ క్రమంలోనే పింఛన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఈ సమీక్ష సమావేశంలో మహిళలకు అందించే ఇందిరమ్మ చీరలు నాణ్యంగా, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని సూచించారు. డిజైన్ల కోసం నిఫ్ట్ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని, పల్లెల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా పథకాలలో పనిచేసే వారికి ప్రతినెల 5వ తేదీలోపు విత్తనాలు ఇవ్వాలన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తూ ఎంపీడీవోలు మండల స్థాయి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని, 45 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అన్ని గ్రామాలలో తారు రోడ్లు ఉండాలని, జనాభా ఆధారంగా పంచాయతీ భవనాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు చేయాలని, రైతులు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.పేద బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత
పల్లెల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలి
పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం.. అంత్యక్రియలు ఎప్పుడంటే
వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్