తెలంగాణాకు రైల్వే భారీ వరాలు.. రూ.48వేల కోట్లతో 21 ప్రాజెక్టులు, లెక్క ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ రైల్వే ప్రాజెక్టులను వేలకోట్ల రూపాయలను వెచ్చించి అందిస్తున్న రైల్వే రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి నిధులపై పార్లమెంట్ లో స్పష్టత ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే పనులకు 2026 - 27 బడ్జెట్లో 5,454 కోట్లను కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

Advertisement

రోడ్ ఓవర్ బ్రిడ్జి లు, అండర్ బ్రిడ్జిల పైన రైల్వే శాఖామంత్రి వివరణ

రాష్ట్రంలో రైల్వే పరిధిలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జి లు, అండర్ బ్రిడ్జిల పైన ఎన్ని నిధులు కేటాయిస్తుంది అనేది పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఇచ్చిన సమాధానంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రైల్వే పనులు ఎంత ఖర్చుతో వివిధ దశల్లో కొనసాగుతున్నాయి అనేది స్పష్టమైంది.

Advertisement

4,883 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 118 రైల్వే పనులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,883 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 118 రైల్వే పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో మరో మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లను నిర్మిస్తుందని వెల్లడించారు.

వరంగల్ జిల్లాలో వివిధ దశల్లో 4 రోడ్డు ఓవర్, అండర్ బ్రిడ్జిల పనులు

2026 జూన్ 1 నాటికి వరంగల్ జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 7 రైల్వే అండర్ బ్రిడ్జిలు, 8 లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో 4 రోడ్డు ఓవర్, అండర్ బ్రిడ్జిల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. మొత్తం 197 కోట్ల రూపాయలతో వీటిని చేపట్టినట్టు వెల్లడించారు.

Advertisement

888 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి

వాటిలో వరంగల్- చింతలపల్లి మధ్య లెవల్ క్రాసింగ్ నెం.64 వద్ద రూ.77 కోట్లతో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్ ఖరారైందన్నారు. నలుగురు నెక్కొండ రోడ్ అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. 2014 నుండి 2026 మధ్య తెలంగాణ రాష్ట్రంలో 888 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి చేసినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు పర్మిషన్.. సర్వం సిద్ధం; పర్యటన వెనుక..

48 వేల కోట్లతో 21 ప్రాజెక్టుల మంజూరు

మొత్తం దాదాపు 48 వేల కోట్లతో 21 ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 677 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం 2792 హెక్టార్ల భూమిలో 1772 హెక్టార్లను సేకరించగా, ఇంకా ఒక వెయ్యి 20 హెక్టార్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. భూసేకరణ ఆలస్యం కావడంతో కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని స్పష్టం చేశారు.

English Summary

telangana railway news: railway good news and gave a huge budget to telangana railway projects wotrh rs.48,000 crores. 118 railway works worth ₹4,883 crore are in progress in Telangana, with additional details on track construction and land acquisition.