తెలంగాణాకు వానదేవుడి కబురు.. నేడు రేపు వర్షాలు!

ఎల్ నినో ప్రభావంతో ఈసారి తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వర్షాలు నమోదయ్యాయి. ఇక ప్రభుత్వం కూడా వర్షాభావ పరిస్థితులపై ప్రజలను అలెర్ట్ చేస్తుంది. ముఖ్యంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచనలు చేస్తుంది. అయితే ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి హెచ్చరిక చేసింది.

Advertisement

నేడు రేపు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. నేడు తూర్పు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

ఈ జిల్లాలలో నేడు వర్షాలు

హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్ లో కూడా వర్షాలు

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ నారాయణపేట వంటి ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాలలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది.. మల్లన్న భక్తులు రెడీ అయిపోండి!

నిన్న రాష్ట్రంలో వర్షాలు ఇలా

ఇదిలా ఉంటే నిన్న రాష్ట్రంలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో అత్యధికంగా 708 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వికారాబాద్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ గద్వాల సూర్యాపేట ఖమ్మం జిల్లాలలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, మిగతా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

English Summary

Telangana rain alert: Telangana weather forecast for July 27: Moderate to heavy rains expected in northern and eastern districts. IMD issues rain alert for Hyderabad and several other areas. Check latest rainfall updates and temperature trends.