ఇంటర్వ్యూలు లేకుండానే యూనివర్సిటీలలో జాబ్స్.. 984 ఉద్యోగాల భర్తీ!

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలోను ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే వ్యవసాయ, ఉద్యానవనాలు మరియు పశువైద్య రంగాలకు సంబంధించిన మూడు ప్రధాన విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

Advertisement

ఖాళీగా ఉన్న 984 ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రధాన విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 984 ఉద్యోగాలను ఇంటర్వ్యూలో నిర్వహించకుండానే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమలులో ఉన్న మౌఖిక పరీక్షల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కేవలం రాత్రి పరీక్షలు మరియు అకడమిక్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.

Advertisement

ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఇది పెద్ద ఉపశమనం

ఈ నిర్ణయం ద్వారా నియామకాల్లో పారదర్శకతను నిర్ధారించడం, అవినీతి మరియు సిఫార్సులకు అవకాశం లేకుండా చేయడం ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని యువకులు, ముఖ్యంగా వ్యవసాయం, సంబంధిత రంగాల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఇది పెద్ద ఉపశమనంగా మారనుంది. ఇప్పటికే అనేక పోటీ పరీక్షల్లో మౌఖిక పరీక్షలను తొలగించిన తర్వాత ఇప్పుడు విశ్వవిద్యాలయాల స్థాయిలో కూడా అదే విధానం అమలు చేయడం గమనార్హం.

550 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్

ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో మొత్తం 550 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది. వైస్ ఛాన్సలర్ జానయ్య ప్రకటన ప్రకారం, రాతపరీక్ష మార్కుల ఆధారంగానే ఎంపికలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి సిలబస్, పరీక్షా షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇక్కడ 79అసిస్టెంట్ ప్రొఫెసర్, 44అసోసియేట్ ప్రొఫెసర్ మరియు 17ప్రొఫెసర్ పోస్టులతో సహా మొత్తం ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది.

Advertisement

బ్యాక్‌లాగ్ పోస్టులు, కొత్త ఖాళీలు కలిపి మొత్తం 294 పోస్టుల భర్తీ

ఈ పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు రద్దు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ విశ్వవిద్యాలయం సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులు మరియు కొత్త ఖాళీలను కలిపి మొత్తం 294 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక్కడ కూడా ఒకే విధానం అమలు అవుతుంది. ఈ నిర్ణయం గురించి అభ్యర్థులు మరియు విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నియామకాల ప్రక్రియతో విశ్వవిద్యాలయాల అభివృద్ధి

సిఫార్సులు, లాబీయింగ్ వంటి అనవసరమైన అంశాలు తొలగిపోతాయని, నిజమైన ప్రతిభ ఉన్నవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అర్హులైన యువకులకు న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పు వల్ల నియామకాల ప్రక్రియ వేగం పుంజుకుని, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. సంబంధిత విశ్వవిద్యాలయాల బోర్డులు త్వరలో పూర్తిస్థాయి సిలబస్, పరీక్ష తేదీలు, ఎంపిక ప్రక్రియ వివరాలను అధికారికంగా వెల్లడించనున్నాయి. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని నిరుద్యోగ యువతకు సూచించారు.

English Summary

Telangana University Jobs: Telangana Govt has announced direct recruitment for 984 university posts in Agriculture, Horticulture, and Veterinary Universities without interviews. Selections will be based purely on written exams and academic merit for greater transparency.