వెయ్యి బస్సులు తాత్కాలిక నిలిపివేత.. తెలంగాణా ఆర్టీసీ నిర్ణయం వెనుక!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ప్రయాణికుల భద్రతను ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రాం ఆధ్వర్యంలో నడుస్తున్న జె బి ఎం కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో భద్రతా కారణాలతో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

ఆర్టీసీ బస్సులలో హై వోల్టేజ్ బ్యాటరీలతో సంబంధం ఉన్న అగ్ని ప్రమాదాలు

ఇటీవల కాలంలో ఈ బస్సులలో హై వోల్టేజ్ బ్యాటరీలతో సంబంధం ఉన్న అగ్ని ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్న కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21వ తేదీన కరీంనగర్ సమీపంలోని అలుగునూర్ ప్రాంతంలో జె బి ఎం అగ్నిప్రమాదం సంభవించటం ఈ ఘటన పైన పూర్తి నివేదిక రాకముందే మరో సంఘటన వెలుగు చూడడం తో ఆర్టీసీ అలర్ట్ అయింది.

Advertisement

ఆ బస్సుల సేవలు తాత్కాలిక నిలిపివేత

ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ఎటువంటి అపాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఈ ఎలక్ట్రికల్ సేవలు తగ్గిపోతుండగా, ఆర్టీసీ మాత్రం ప్రయాణికుల భద్రత ప్రథమ ప్రాధాన్యంగా ఈ నిర్ణయం ద్వారా స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.

వెయ్యి బస్సుల సేవలు బంద్

ఇక తెలంగాణ రాష్ట్రంలో jbm సంస్థకు చెందిన సుమారు 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, వీటిలో 500 బస్సులు హైదరాబాద్ నగరం వెలుపల వివిధ జిల్లాలలో, వివిధ డిపోల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెయ్యి బస్సుల సేవలను తాజా అగ్ని ప్రమాద ఘటనల నేపథ్యంలో నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఈ తాత్కాలిక బస్సు సేవల నిలుపుదల కేవలం జేబీఎం బస్సులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

Advertisement

జేబీఎం బస్సుల విషయంలో కంపెనీకి సూచన

ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపైన ఎటువంటి సందేహాలు లేవని ఆర్టీసీ వెల్లడించింది. వాటి సేవలు సాధారణంగానే కొనసాగుతాయని పేర్కొంది. అయితే ప్రమాదాల బారిన పడుతున్న జేబీఎం బస్సుల విషయంలో, ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు సూచించాలని ఆర్టీసీ ఆదేశించింది. ఇక తాజా పరిణామాలతో రంగంలోకి దిగిన జేబీఎం సంస్థ తమ టెక్నికల్ టీం తో పని మొదలు పెట్టింది.

భద్రత ఓకే అయితేనే మళ్ళీ రోడ్డు మీదికి ఆ బస్సులు

బ్యాటరీ వ్యవస్థలో ఉన్న సమస్యలను గుర్తించడానికి చైనా నుండి ప్రత్యేక నిపుణులను రప్పించి పరిశీలనలు చేస్తుంది. ఈ సంస్థ బస్సులలో అవసరమైన మెరుగుదలల తర్వాత అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తే తిరిగి ఈ బస్సు సేవలను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది.

English Summary

TGSRTC temporarily suspends JBM electric buses in Telangana over battery fire safety concerns. Services halted until full investigation and fixes are completed. Passenger safety is the top priority.