హైదరాబాద్ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కేసులో తాజాగా అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లైంగిక వేధింపులు ఫిర్యాదు ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పైన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును నగర మహిళా భద్రత విభాగం డిసిపి లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో సాగుతోంది.
అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలైన మరో ట్రైనీ మహిళా ఐపీఎస్ కూడా తనపై జరిగిన దాడిని, అసాధారణ ప్రవర్తనను గురించి వివరించగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ లో భాగంగా అధికారులు అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ లాప్టాప్, సెల్ ఫోన్, ఇద్దరు వ్యక్తుల చేతిరాతతో రాసిన రెండు ప్రేమలేఖలు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రేమలేఖలపై ఉన్న పేర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అతనికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధం ఉన్నట్టు గుర్తించారు. 2014లో ఆ మహిళ వివాహం చేసుకోగా, 2023 నుంచి భర్త నుంచి వేరుగా కుమారుడితో ఉంటున్నట్టు గుర్తించారు. ఈ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారిందని తెలుస్తోంది. సదరు మహిళ హైదరాబాద్ కు వచ్చి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సలహా మేరకు ఉద్యోగం వదిలి, అశోక్ నగర్ లోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిన తర్వాత లివ్ ఇన్ రిలేషన్ కు అతను ప్రతిపాదన చేశారు. అయితే చట్టపరంగా విడాకులు రాకపోవడంతో ఆమె నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బాధితురాలు అయిన ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆ మహిళను కలిసి ఉదయ్ కృష్ణారెడ్డి గురించి చెప్పినట్టు, తన బాధను పంచుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ నిందితుడికి దూరంగా ఉంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు సుమారు 20 మంది నుండి వాంగ్మూలాలు తీసుకున్నారు. అంతేకాదు మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా చొరబడి ఫోన్ తీసుకున్న విషయం కూడా ఆధారాలతో సహా నిర్ధారణ అయింది. ఉదయ్ కృష్ణారెడ్డికి ఉన్న విపరీతమైన కోపం, అసాధారణ ప్రవర్తన వలన శిక్షణ సమయంలో చాలామంది మానసికంగా బాధ పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్న క్రమంలో, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఏపీకి చెందిన మరో మహిళతో సన్నిహిత సంబంధం
వివాహితతో లివ్ ఇన్ రిలేషన్ కు ప్రతిపాదన పెట్టిన ట్రైనీ ఐపీఎస్
ఆ మహిళను కలిసి తన ఇబ్బంది చెప్పుకున్న బాధితురాలు
పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రేమ.. కేసీఆర్ ఏం చేశారో తెలుసా!
మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా వెళ్లి ఫోన్ తీసుకున్నట్టు నిర్ధారణ