భార్యకు వీడియో కాల్ చేసి ఆపై సూసైడ్ చేసుకున్న వ్యక్తి.. రీజన్ ఇదే!

వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్నవారిని, కట్టుకున్న భార్యను వదిలి ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అది కూడా తన భార్యతో సెల్ ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుతూనే ప్రాణాలు తీసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.

కుటుంబంలో ఆస్తుల పంచాయితీ... తీవ్ర మానసిక ఒత్తిడితో వ్యక్తి

ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు మరియు స్థానిక తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ లో నివాసం ఉండే వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేసే రాజేష్ నాయక్ కుటుంబంలో ఆస్తులకు సంబంధించి చోటు చేసుకున్న ఘర్షణలతో తీవ్రమైన మనస్థాపానికి గురై ప్రాణం తీసుకున్నాడు. భార్య భర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలు, వ్యక్తిగత కారణాలు ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేశాయి.

భార్యతో గొడవ.. కాజీపేట రైల్వే ట్రాక్ పైకి వెళ్లి

దీంతో చివరికి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్న రాజేష్ నాయక్ భార్యతో గొడవపడి ఇంటి నుండి బయటకు వచ్చాడు. గత కొంత కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో రాజేష్ నాయక్ తల్లిదండ్రులకు, భార్యకు మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది. ఎవరికీ నచ్చజెప్పలేక, ఆ గొడవలకు చిరాకు చెందిన రాజేష్ నాయక్ ఆరోజు కాజీపేటలో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు.

భార్యకు వీడియో కాల్.. ఆపై చేసిన పని ఇదే

రైల్వే ట్రాక్ పైన నిలబడి మొబైల్ ఫోన్ ద్వారా తన భార్యకు వీడియో కాల్ చేసి తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు గా వీడియోలో రైల్వే ట్రాక్ ని చూపించాడు. అయితే భర్త తనను బెదిరిస్తున్నాడని భావించిన భార్య, అతను చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తిరిగి ఇంటికి రాకపోయేసరికి రాజేష్ నాయక్ కోసం రాత్రంతా తల్లిదండ్రులు భార్య వెతుకుతూనే ఉన్నారు.

కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబం

తెల్లవారుజామున రైల్వే పట్టాలపై డెడ్ బాడీ ఉందని తెలిసి అక్కడికి పెళ్లి అది రాజేష్ నాయక్ డెడ్ బాడీ కావడంతో అందరూ షాక్ తిన్నారు. ఇంత పని చేస్తాడు అనుకోలేదని రాజేష్ నాయక్ భార్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

క్షణికావేశంలో నిర్ణయం

ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మరణించిన రాజేష్ నాయక్ కు ఒక కుమారుడు ఉన్నాడు.

English Summary

Warangal video call suicide: A shocking incident has occurred in Warangal district, where a man took his own life by jumping in front of a train while speaking to his wife on a video call.