AI టీచర్‌ను క్రియేట్ చేసిన 17 ఏళ్ల విద్యార్ధి..!

మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేసి చూపించవచ్చని ఇప్పటికే ఎందరో నిరూపించారు. ఇప్పుడు అదే బాటలో తనకున్న పరిమితుల తోనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏకంగా ఏఐ టీచర్ ని రూపొందించి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరగ్గా.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎవరంటే..

ఏఐ టీచర్ ని రూపొందించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్. ఈ స్టూడెంట్ "సోఫీ" అనే పేరుతో ఒక కృత్రిమ మేధస్సు (AI) టీచర్‌ను రూపొందించాడు. శివచరణ్ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న ఆదిత్య రోబో తయారు చేశాడు. ఈ ఏఐ టీచర్ రోబోకు LLM చిప్‌సెట్ అమర్చబడి ఉంది. ఇది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

17-years-old-inter-student-created-ai-teacher-named-sophie-and-video-got-viral

కాగా ఈ వైరల్ అవుతున వీడియోలో రోబో పలు విషయాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కనిపించింది. తనను పరిచయం చేసుకోమని అడిగినప్పుడు.. తాను ఒక AI టీచర్ రోబోనని.. పేరు సోఫీ అని.. ఆదిత్య తనను కనుగొన్నట్టు వెల్లడించింది. తను బులంద్‌షహర్‌లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తానని.. విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలనంటూ సమాధానం ఇచ్చింది.

రోబో తయారీ గురించి ఆదిత్య మాట్లాడుతూ.. రోబోను తయారు చేయడానికి నేను LLM చిప్‌సెట్‌ను ఉపయోగించానని తెలిపాడు. పెద్ద కంపెనీలు కూడా తమ రోబోలలో దీన్ని ఉపయోగిస్తాయని పేర్కొన్నాడు. ఇది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయగలదని వివరించాడు. ప్రస్తుతం ఇది మాట్లాడగలదని.. త్వరలో రాయడానికి కూడా వీలుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పాడు. ప్రపంచంలోనే ఎత్తైన భవనం, భారతదేశపు మొదటి రాష్ట్రపతి, మొదటి ప్రధాని వంటి వివిధ ప్రశ్నలు అడిగి సోఫీ ఎలా పనిచేస్తుందో ఆదిత్య చూపించాడు. విద్యుత్ అంటే ఏమిటి?" అని అడిగినప్పుడు, "100 + 92" మొత్తాన్ని కూడా రోబో లెక్కించి సమాధానం ఇచ్చింది.

విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలదా అని ఆదిత్య అడిగినప్పుడు.. సోఫీ తాను పిల్లలకు చక్కగా బోధించగలనని బదులిచ్చింది. ప్రస్తుతం సోఫీ కేవలం హిందీలో మాత్రమే మాట్లాడుతుంది. ఉపాధ్యాయుడు అందుబాటులో లేని రోజులలో తన రోబో ప్రత్యామ్నాయంగా బోధించగలదని ఆదిత్య పేర్కొన్నాడు. ప్రతి జిల్లాలోనూ పరిశోధనల కోసం విద్యార్థులకు సరైన ల్యాబ్‌లు అందుబాటులో ఉండాలని ఆదిత్య అభిప్రాయపడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+