గూగుల్ సరికొత్త "ఏఐ" ప్లాట్‌ఫామ్.. వారి కోసమే !
వ్యాపార సంస్థల కోసం గూగుల్ సరికొత్త ఏఐ ప్లాట్‌ఫామ్ 'జెమిని ఎంటర్‌ప్రైజ్'ను ప్రారంభించింది. కార్పొరేట్ క్లయింట్లను ఆకర్షించే లక్ష్యంతో ఈ కృత్రిమ మేధస్సు (AI) ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ ప్రకటించింది.
జెమిని ఎంటర్‌ప్రైజ్ గూగుల్ అత్యంత అధునాతన ఏఐ మోడల్స్‌తో పనిచేస్తుంది. ఇది ఒక సంభాషణ ప్లాట్‌ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగులు తమ సంస్థల డేటా, పత్రాలు, అప్లికేషన్‌లతో సంభాషించడానికి ఇది వీలు కల్పిస్తుంది అని గూగుల్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐ, ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ వంటి టెక్ కంపెనీలన్నీ ఏఐ ప్రయత్నాల ద్వారా రాబడిని పెంచుకోవడానికి వ్యాపారాల కోసం ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నాయి.

జెమిని ఎంటర్‌ప్రైజ్ అందించే సేవలు లోతైన పరిశోధన, డేటా విశ్లేషణ వంటి పనులకు సహాయపడతాయి. కంపెనీలు తమ సొంత అనుకూల ఏఐ ఏజెంట్లను రూపొందించడానికి, విస్తరించడానికి అవసరమైన టూల్స్‌ను కూడా జెమిని ఎంటర్‌ప్రైజ్ అందిస్తుంది అని గూగుల్ వివరించింది. అపెరల్ రిటైలర్ గ్యాప్, డిజైన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫిగ్మా, బై-నౌ-పే-లేటర్ (BNPL) రుణదాత క్లార్నా వంటి కొత్త కస్టమర్‌లను ఈ ప్లాట్‌ఫామ్ కోసం ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు టెక్ దిగ్గజం వెల్లడించింది.
ఈ కొత్త ప్లాట్‌ఫామ్ గూగుల్ ఇప్పటికే అందిస్తున్న ఎంటర్‌ప్రైజ్ క్లయింట్ల కోసం రూపొందించిన గూగుల్ వర్క్‌స్పేస్‌కు కొనసాగింపుగా స్పష్టం చేసింది. గూగుల్ వర్క్‌స్పేస్ ప్రస్తుతం జెమిని ఆధారిత అనేక ఏఐ ఫీచర్లను వ్యాపారాలకు అందిస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా అదనపు సేవలను సైతం అందించనున్నట్టు వెల్లడించింది.












Click it and Unblock the Notifications