ఊహించని విధంగా చైనాకు బిగ్ చెక్ పెట్టిన భారత్
పొరుగుదేశం చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. అమెరికా ప్రతిపాదించిన ప్యాక్స్ సిలికా కూటమిలో చేరింది. దీనికి సంబంధించిన డిక్లరేషన్ పై సంతకం చేసింది కూడా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సప్లై చైన్ ను పటిష్ట పర్చడానికి, కీలక ఖనిజాలను వెలికి తీయడానికి, అరుదైన ఎర్త్ మినరల్స్ లో చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనాలనే ఉద్దేశంతో అమెరికా దీన్ని ప్రతిపాదించింది. అమెరికానే దీనికి నేతృత్వం వహించనుంది. ఈ కూటమిలో చేరింది భారత్.
వ్యూహాత్మక సహకారం..
ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈ డిక్లరేషన్ పై సంతకం చేసింది. దీంతో- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఖనిజ సంబంధిత రంగాలకు కీలక వనరుల లభ్యతను పటిష్ట పర్చినట్టయింది. అలాగే భారత్- అమెరికా మధ్య గతంలో బలహీనపడిన ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఇదీ ఒకటిగా చెబుతున్నారు. వాణిజ్య ఒప్పందాలు, ఇతర కార్యక్రమాల పురోగతిని వేగవంతం చేస్తూ, వ్యూహాత్మక సహకారాన్ని భారత్ పెంపొందించుకుంటోంది.

ప్యాక్స్ సిలికా అంటే..
ప్యాక్స్ సిలికా అనేది ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు సెమీకండక్టర్ల తయారీలో అత్యంత కీలకం. సెమీకండక్టర్ల రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది చైనా. వీటి తయారీకి అవసరమైన విడి పరికరాలు, ఇతర మౌలిక సామాగ్రిని ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తోందా దేశం. దీనికి చెక్ పెట్టాలని, ఈ రంగంపై ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతో ప్యాక్స్ సిలికా డిక్లరేషన్/గ్రూప్ ను తెరమీదికి తీసుకొచ్చింది అమెరికా. ఈ సప్లై చైన్ స్థిరీకరించడానికి అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ఇది.
ప్యాక్స్ సిలికా అర్థం..
'ప్యాక్స్' అనేది లాటిన్ పదం. శాంతికి సూచిక. 'సిలికా' అనేది కంప్యూటర్ చిప్స్, ఏఐకి అవసరమైన ప్రాథమిక వనరు. ఈ పేరునే అమెరికా సారథ్యం వహిస్తోన్నఈ కూటమికి పెట్టారు. సురక్షిత, విశ్వసనీయ సాంకేతికతతో ప్రపంచ సుస్థిరతను సాధించాలనేది తమ అభిమతమని అమెరికా ముందు నుంచీ చెబుతూ వస్తోంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో దీన్ని ప్రస్తావించింది. దీనిపై ఆ దేశం చేసిన వినతుల మేరకు భారత్ సంతకం చేసింది.
భారత్‌కు ఇది ఎలా కీలకం..
ఖనిజాలు, సెమీకండక్టర్ల దిగుమతుల్లో చైనాపై ఆధారపడుతోంది భారత్. సుమారు 93 శాతం దిగుమతులు అక్కడి నుండే జరుగుతున్నాయి. ఈ కూటమి.. ఈ భారాన్ని తగ్గిస్తుంది. అధునాతన ఖనిజ శుద్ధి, చిప్ తయారీలో జపాన్, నెదర్లాండ్స్ వంటి సాంకేతిక దిగ్గజాలతో భాగస్వామ్యులు కావడం వల్ల అక్కడి నుండీ ఇంపోర్ట్ చేసుకునే వెసలుబాటు లభించినట్టవుతుంది. ఎర్త్ మినరల్ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ రెండింటికీ అనుగుణంగా ఇది దోహదపడుతుంది.
కేంద్రం ఏం చెబుతోంది..
ఈ డిక్లరేషన్ పై భారత్ సంతకం చేయడం, ఈ కూటమిలో చేరడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. దేశ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమకు ఎంతో ప్రయోజనమని పేర్కొన్నారు. దీనివల్ల భారత్.. సెమీకండక్టర్ల హబ్ గా మారుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 10 ప్లాంట్లు ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయని, త్వరలోనే మొదటి సెమీకండక్టర్ ప్లాంట్ కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభిస్తుందని తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications