స్టాలిన్ కు రాహుల్ కీలక పిలుపు..! డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం..!

గత పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో కలిపి ప్రవేశపెట్టిన బీజేపీ.. దాన్ని నెగ్గించేందుకు అవసరమైన 2/3 వంతు మంది ఎంపీల మద్దతు సాధించలేకపోయింది. దీని వెనుక తమిళనాడుకు చెందిన ఎంపీలు కీలక పాత్ర పోషించారు. అందులోనూ అప్పటి అధికార పక్షం, ప్రస్తుతం విపక్షంలో ఉన్న డీఎంకే ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. అయితే ఇప్పుడు తమిళనాడులో పరిస్ధితులు మారాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంకేను కాదని విజయ్ ప్రభుత్వంలో చేరింది. ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది.

కొలీజియం వ్యవస్థపై సుప్రీం జడ్జి షాకింగ్ కామెంట్స్- అందుకున్న కాక్రోచ్..!
కొలీజియం వ్యవస్థపై సుప్రీం జడ్జి షాకింగ్ కామెంట్స్- అందుకున్న కాక్రోచ్..!

దీంతో డీఎంకే ఎంపీలు ఈసారి కచ్చితంగా తమకు మద్దతుగా నిలుస్తారనే అంచనాతో డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తెస్తోంది. టీఎంసీ, ఆప్, శివసేన పార్టీల్ని చీల్చి, ఆ ఎంపీల మద్దతు కూడా కలుపుకుని డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) రంగంలోకి దిగారు. విజయ్ కు తాము మద్దతివ్వడంపై గుర్రుగా ఉన్న మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఉద్దేశించి ఇవాళ ఓ కీలక పిలుపునిచ్చారు. పైకి మాత్రం అన్ని తమిళ పార్టీలకూ, ఎంపీలకు అని రాహుల్ పేర్కొన్నారు.

Rahul Gandhi calls delimitation a BJP conspiracy against Tamil Nadu urges all parties to oppose it
కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!
కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, తమిళనాడు ప్రజల ఓటు హక్కును ,, అధికారాన్ని హరించడమే ఈ పునర్విభజన ఉద్దేశమని, ఇది బీజేపీ పన్నాగమని రాహుల్ గాంధీ ఇవాళ ఆరోపించారు. పునర్విభజనకు మద్దతు ఇచ్చే ఎవరైనా తమిళనాడుకు ద్రోహం చేస్తున్నట్లే అన్నారు. వారు తమిళనాడు భవిష్యత్తుకు ద్రోహం చేస్తున్నారని, తమిళనాడు ప్రజలపై, ఆ రాష్ట్ర భవిష్యత్తుపై దాడి చేయడానికి బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఇది 21వ శతాబ్దపు దాడి అన్నారు. ఏ తమిళుడూ ఈ పునర్విభజనకు మద్దతు ఇవ్వకూడదన్నారు. ప్రతి తమిళుడూ దీనిని వ్యతిరేకించాలన్నారు. ప్రతి తమిళ పార్టీ, అలాగే ప్రతి జాతీయ పార్టీ కూడా సభలో ఈ పునర్విభజనను ఓడించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+