ఒరాకిల్- ఎంప్లాయిస్ పై ఉరుము లేని పిడుగు
Oracle Layoffs: ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన ఒరాకిల్.. లేఆఫ్స్ పై దృష్టి సారించింది. దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితులయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఓపెన్ ఏఐ చీఫ్ సమావేశం తర్వాత ఈ తొలగింపులు చోటు చేసుకోవడం.. పలు ఊహాగానాలకు దారి తీసింది.

ఒరాకిల్‌కు ఎప్పటినుంచో వ్యూహాత్మకంగా మానవ వనరుగా ఉంటోంది.. భారత్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పుడు సుమారు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడం చర్చనీయాంశమైంది.
జియో-ఎక్స్‌పాన్షన్ ప్రోగ్రామ్ కింద జైపూర్, భోపాల్, చండీగఢ్, తిరువనంతపురం వంటి టయర్-2, టయర్-3 నగరాల్లోకి కూడా ఒరాకిల్ విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాల్సి రావడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
డేటా సెంటర్ డైనమిక్స్ రిపోర్ట్ ప్రకారం- సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సర్వీసెస్, కస్టమర్ సపోర్ట్ డివిజన్లల్లో పనిచేసే ఉద్యోగులు ఈ తాజా లేఆఫ్స్ వల్ల ప్రభావితమయ్యారు. ఎటువంటి ముందస్తు సమాచారం గానీ, అంతర్గతంగా సర్కులర్లు గానీ లేకుండా ఆకస్మికంగా ఈ నిర్ణయం వెలువడినట్లు డేటా సెంటర్ డైనమిక్స్ తెలిపింది. తొలగింపునకు గురైన వారికి పరిహారం చెల్లింపులు, భవిష్యత్ నియామకాలపై స్పష్టత లేదని సమాచారం.
లేఆఫ్స్ ప్రకటన వెలువడటానికి కొన్ని రోజుల ముందు- ఒరాకిల్ సీఈఓ లారీ విల్సన్.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వైట్ హైస్ లోని ఓవల్ ఆఫీసులో ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ చర్చల్లో దేశీయ నియామకాలు, నేషనల్ డేటా సెక్యూరిటీ, సాంకేతిక భాగస్వామ్యాలు.. ప్రధాన అజెండాగా ఉన్నాయని సమాచారం.
ఆ తర్వాత.. ఓపెన్‌ఏఐతో ఓ కీలక ఒప్పందాన్ని ఒరాకిల్ ప్రకటించింది. అమెరికన్ కంపెనీలు భారత్ సహా విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని, హెచ్-1బీ వీసాలనూ పరిమితం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనల మేరకు ఈ తాజా నిర్ణయం వెలువడిందని, ఎక్కువమంది ఉద్యోగులను అమెరికా నుంచే తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఈ ఉద్యోగ కోతలతో భారత్ ఎక్కువగా ప్రభావితమైంది. 10 శాతం మంది లేఆఫ్స్ బారిన పడాల్సొచ్చింది. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి తొలగింపులు చోటు చేసుకున్నాయి. అమెరికా, కెనడా, మెక్సికోలలోని ఒరాకిల్ ఉద్యోగులను కూడా తొలగించినట్లు డైనమిక్స్ రిపోర్ట్ వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పోటీ తీవ్రతరమౌతున్నందున.. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, హై-ఎండ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలపై బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఖర్చులను సమతుల్యం చేయడానికి, చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది సుమారు 15,000 ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్, మెటా కూడా నియామకాలను తగ్గించుకున్నాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications