తెలంగాణలోని మహిళలకు అండగా AI.. టాటా సిస్టమ్స్ తో షీ టీమ్స్ కీలక ఒప్పందం
తెలంగాణలోని మహిళల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే 'మహాలక్ష్మి' పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని గృహిణులకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. తాజాగా మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల సంరక్షణ, భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ- టీమ్స్ తో టాటా సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది.
రాష్ట్రంలోని షీ టీమ్స్ తో టాటా సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. షీ టీమ్స్, భరోసా కేంద్రాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత సహకారం ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సమాజంపై ప్రభావం చూపే విధంగా పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడం అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షీ టీమ్స్ అధికారులు, టాటా సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధుల మధ్య సంతకాలు చేయడంతో ఎంఓయూ కుదిరింది.

ఈ ఒప్పందంతో షీ టీమ్స్ , భరోసా కేంద్రాలకు ఏఐ లాంటి సాంకేతికతతో మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంతో పాటు ఆయా అంశాల్లో పనిచేస్తున్న పోలీసులకు సాంకేతికత సాయం అందించనుంది. ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీతో కేసులను త్వరగా ఛేదించే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. ఒప్పందంలో భాగంగా ఇక ఏఐ లాంటి సాంకేతికతను పోలీసులు అర్థం చేసుకునేలా శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దీనివల్ల పోలీసులు, అధికారుల పనితీరు మెరుగుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications