పాకిస్తాన్ 70 ఏళ్ల వ్యవస్థ సర్వనాశనం: సొంత ప్రభుత్వంపైనే హోంమంత్రి బిగ్ బాంబ్!

పాకిస్తాన్‌లో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం మధ్య ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ ఓ కీలక ప్రకటన చేశారు. అధికార కేంద్రంలో కొలువుదీరిన మొహ్సిన్ నఖ్వీ.. పాకిస్తాన్ ప్రస్తుత పాలన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని.. దేశ 70 ఏళ్ల పురాతన వ్యవస్థ నిర్మాణం పూర్తిగా విఫలమైందని బహిరంగంగా అంగీకరించారు. ఓ కార్యక్రమంలో మొహ్సిన్ నఖ్వీ ప్రసంగిస్తూ.. దేశంలోని వాస్తవ పరిస్థితులను నిష్కపటంగా వివరించారు. నమ్మినా నమ్మకపోయినా మనం జీవిస్తున్న వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలిపోయిందని పాక్ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశ ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయిందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పదేళ్ల తర్వాత కూడా మనం అవే సమస్యలు, అంశాల గురించి చర్చిస్తూనే ఉంటామన్నారు.

పాకిస్థాన్ కు బిగ్ రిలీఫ్.. గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ అరేబియా
పాకిస్థాన్ కు బిగ్ రిలీఫ్.. గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ అరేబియా

గత 70 ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న వ్యవస్థ ఇక పనిచేయడం లేదని మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారని.. కానీ ప్రజాస్వామ్యంలోనే మూడు నాలుగు రకాల వ్యవస్థలు ఉన్నాయన్నారు. గత 70 ఏళ్లుగా మనం అనుసరిస్తున్న వ్యవస్థ మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లలేదని.. మనం ఇంకా అక్కడే చిక్కుకోపోయామని అన్నారు.

Pakistan 70 Year Old System has Completely Collapsed Home Minister Mohsin Naqvi Big Statement Details
మోదీ చెప్పినా తగ్గేదేలే.. బంగారం కొనుగోళ్లలో భారత్ నయా రికార్డు!
మోదీ చెప్పినా తగ్గేదేలే.. బంగారం కొనుగోళ్లలో భారత్ నయా రికార్డు!

ఆ ప్రకటనకు మోగిన చప్పట్లు
అధికారంలో ఉన్న హోంమంత్రి తన సొంత ప్రభుత్వం, వ్యవస్థ వైఫల్యాల్ని అంగీకరించడం అత్యంత దిగ్భ్రాంతికరంగా పరిగణించబడుతోంది. మరీ ముఖ్యంగా మొహ్సిన్ నఖ్వీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని మాట్లాడినప్పుడు ఆయన ముందున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. పాకిస్తాన్ హోమంత్రి చేసిన ఈ ప్రకటన ఆ దేశంలో తీవ్రమవుతున్న పరిపాలనా, ఆర్థిక, సంస్థాగత సంక్షోభానికి నిదర్శనంగా నిలిచింది. దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల బాధ్యతలు చూస్తున్న మంత్రి నుంచి వెలువడిన ఈ ప్రకటన.. పాకిస్తాన్‌లోని రాజ్యాంగ, పరిపాలనా సంస్థలు ఎంత శక్తిహీనంగా, అసమర్థంగా తయారయ్యాయో తెలియజేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+