టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుందన్న ఎంపీ జితేందర్ రెడ్డి మాటలను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి
ఎన్నికల సీజన్ కావడంతో పార్టీలలో జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. లోక్‌సభ టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన జితేందర్ రెడ్డి కూడా ఇదే కోవలో చేరారు. పార్టీ టికెట్ ఆశించి నిరాశచెందిన ఆయన బీజేపీలో చేరారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పార్టీ పట్ల, అధినేత పట్ల పూర్తి వినయవిధేయతలు ప్రదర్శించిన ఆయన తాజాగా ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలకు ఎంపీ టికెట్ అమ్ముకుందన్నది జితేందర్ రెడ్డి ఆరోపణ. ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన టీఆర్ఎస్ పాలమూరు టికెట్టుకు ఎక్కువ రేటు పలికందట అని రూ.200 కోట్లకు అమ్ముకున్నారట అని చెప్పారు. ఇక చేవెళ్ల సీటుకు 150 కోట్లు ఖరీదు కట్టారని, ఇంకో సీటు 100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ సీట్లు అమ్ముకుంటోందని ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications